Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోదాడలో దిగజారుతున్న హస్తం..?

బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇనుమడించిన ఉత్సాహం

• మరో వైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యపు నీరసత్వం

• ఇంచార్జి పనితీరుతో నియోజకవర్గంలో దిగజారుతున్న పార్టీ ప్రతిష్ట..?

• 4 సంవత్సరాల పాటు కార్యకర్తలను గాలికి వదిలేయటంతో క్యాడర్లో అసంతృప్తి

• ఇప్పుడు వచ్చి గెలిపించాలంటే ఎలా సాధ్యమంటున్న పార్టీ వర్గాలు

• టూరిస్టులా 6 నెలలకొక్కసారి దర్శనమిస్తే నమ్మేది ఎవరంటూ అసహనం

• బీఆర్ఎస్ తో బేరసారాలు ఆడటంతో విశ్వసనీయత కోల్పోయిందని ఆ పార్టీ వారే విమర్శలు

• ఒక వేళ మద్దతు ఇచ్చి గెలిపిస్తే.. ఇదే పార్టీలో ఉంటారా అన్నది సవా లక్ష్య ప్రశ్నలు..?

• ఐదు మండలాలోనూ రెడ్డి సామాజిక వర్గం వారే అధ్యక్షులా…!

• బడుగులు అంటే ఇంత చిన్న చూపా… !

• నిత్యం ప్రజల వెన్నంటే ఉండే వారికే అపూర్వ ఆదరణ

కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లం మల్లయ్యయాదవ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ… సమస్యలు పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందజేస్తూ కష్ట, నష్టాలలో నేను ఉన్నానంటూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు ఇతోధికంగా చేయూతనందిస్తుంటే…

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యత నిర్వహిస్తున్న వారు ఇప్పటి వరకు కార్యకర్తలు బతికి ఉన్నారా.. లేదా అని పట్టించుకోకుండా ఇప్పుడు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించటం పట్ల ఆ పార్టీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గెలిచినా, ఓడినా.. బొల్లం మల్లయ్యయాదవ్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజల కష్ట నష్టాలలో భాగస్వామ్యం అయ్యారని అయితే కాంగ్రెస్ ఇంచార్జి మాత్రం ఓడిన తర్వాత పత్తా లేకుండా పోయి వెళ్లి నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్న సమయంలో తనను గెలిపించాలనటం ఏ మేరకు సమజసమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…

కరోనా కష్ట కాలంలో తమను గాలికి వదిలేసి ఇబ్బంది పడుతున్న పార్టీ శ్రేణులకు చేతనైనంతా సహాయం చేయకపోగా కనీసం ఓదార్చడానికైనా రాకపోవడం ఏమిటని అంటున్నారు.

కరోనా కాలంలో ఇండ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేనందున కూలీ నాలీకి వెళ్లలేని వారికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బియ్యం, పప్పు, ఉప్పులు అందించి ఓదార్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

ఎన్నికలప్పుడే తాము గుర్తొస్తామా … కష్ట కాలంలో కనీసం ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవటం దురదృష్టకరమని నిబద్దత గల ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*కష్టకాలంలో కార్యకర్తలకు దిక్కు ఎవరు….*

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైన దోరకుంట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడుని పట్టించుకోలేదని, ఈ పరిణామంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సదరు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే…

పైగా సదరు నాయకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయితే ఒక పైసా కూడా సహాయం చేయలేదని, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు వేసి లక్షన్నర రూపాయలను ఆ కుటుంబాని ఆర్థికంగా ఆదుకున్నారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలోనూ పార్టీని నమ్ముకున్న నాయకులే తమ ఒరగబెట్టిది ఏమిటని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఈ పరిస్థితిలో తమను గెలిపించడానికి అయితే మేము త్యాగం చేయాలి కాని మా కష్టాలు వస్తే పట్టించుకోరా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

*బడుగులంటే ఎందుకంత చిన్నచూపు…*

కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు గాను ఐదు మండలాలలో తమ సామాజిక వర్గానికి చెందిన వారినే అధ్యక్ష స్థానాలు కట్టబెట్టటం బడుగుల పట్ల చిన్నచూపు కాదా అని ప్రశ్నిస్తున్నారు.

అనంతగిరి మండలం చనుపల్లి గ్రామానికి చెందిన బీసీ నాయకుడు ఉపసర్పంచ్ ను ఆకారణంగా పార్టీని తొలగించడం, మోతె, మునగాల మండలాలకు చెందిన తమ సామాజిక వర్గం వారు ఓ బీఆర్ఎస్ నాయకుడితో మంతనాలు జరిపిన క్రమంలో వారిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ వచ్చినప్పటికీ ఎందుకు తొలగించలేదని బీసీలు అంటే లెక్కలేదు అనటానికి ఈ ఊదాహరణ చాలు అని విమర్శలు కూడా ఇంచార్జి పై వస్తున్నాయి.

ఏనాడన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవని వారి ఇండ్లలలో ఎన్నడూ కూడా చేయ్యి కడిగింది లేదంటున్నారు. ఈ దృషపరిణామాలు బడుగులపై ఇంచార్జికి ఏ పార్టీ ప్రేమాభిమానులు ఉన్నాయో స్పష్టమవుతుందని అంటున్నారు.

*బీఆర్ఎస్ బేరసారాలాండింది వాస్తవం కాదా..*

బిఆర్ఎస్ ప్రభుత్వంతో బేరసారములు ఆడింది నిజం కాదని శ్రేణులకు నేరుగా చెప్పిన దాఖలాలున్నాయా..।

గత ఆరు నెలలుగా హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని సామాజిక మాధ్యమాలతో పాటు రెండు నియోజకవర్గాలతో పాటు ఆ పార్టీ అధినాయకత్వంలో కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు వాస్తవం కాదని ఎందుకు ఖండించలేదంటున్నారు.

దీంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు ఈ అంశంపై చర్చించారని పలువురు నాయకులు బహిరంగంగానే స్పష్టం చేసిన విషయం తెలిసిందే..

ఇంత జరుగుతున్నప్పటికి రెండు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తమ నాయకులు పార్టీనే మారిన తాము వెళ్లబోమని తెగేసి చెప్పిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు.

తాము గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమని, నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం పరిచి ఖండించకపోవటం దారుణమని అంటున్నారు.

*కోదాడ లో బీఆర్ఎస్ కే గెలుపు అవకాశాలు…?*

24/7 నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ ఫలాలను పార్టీలకతీతంగా నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందిస్తుండటంతో పాటు ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యుడులా కష్టనష్టాలలో భాగస్వామ్యం అవుతుండటంతో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా తిరిగి రెండోసారి మీరే ఎమ్మెల్యేగా గెలవాలని ఆశీర్వదిస్తున్నారు.

రాష్ట్రంలోనూ, కోదాడలోనూ గులాభి జెండా ఎగరవేయటం ఖాయమని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి ఇప్పటికే గ్రామాల వారిగా ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్న విషయం తెలిసిందే..

స్వార్థంతో సామాజిక వర్గ యావతో పలువురు నాయకులు కాంగ్రెస్ లోకి చేరాలనే ఆలోచన చేస్తే వారి దురదృష్టమని తిరిగి రెండోసారి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపు ఖరారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితుల్లో పరాభావాన్ని చవిచూడాల్సి వస్తుందని వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.