ఖజానాకు వందల పాములను, ఆధ్యాత్మిక శక్తులను రక్షణగా పెట్టిన రాజు
వేల కోట్ల ఖజానాల కోట…ఎవ్వరికీ తెరుచుకోని విధంగా శాపగ్రస్తం..
ఈ నిధిని సొంతం చేసుకోవడానికి కోటలో తవ్వి, రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి నాటి మొఘలు రాజుల నుండి నేటి గ్రామస్తుల వరకు ప్రయత్నం అయినా అందరూ విఫలం..
ఇది రెండువందల యాభై ఏళ్ల క్రితం నాటి నిధికి చెందిన అతి రహస్యమైన కథ.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక రాజవంశం ఖజానా కథ
ఒక పాము ఆధ్యాత్మిక శక్తులు ఆ ఖజానాకు నిత్యం రక్షగా ఉంటాయని, దాని దగ్గరకు ఎవరైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే మృత్యువు తప్పదని అంటున్నారు.
ఇది కల్పిత కథ కాదు వాస్తవాలు. వేలమంది ప్రజలు నమ్మే నిజాలు.
ఒక రాజు తన ఖజానాకు వందల పాములను ఆధ్యాత్మిక శక్తులను రక్షణగా పెట్టాడని, ఎవరైనా వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తే..
సొరంగమార్గాలు వాటంతట అవే మూసుకుపోతాయని అక్కడి స్ధానికులు నమ్ముతారు.
రాజులు, వాళ్ల ఖజానాలు. ఇలా మరుగున పడిపోయిన ఎన్నో కథలను మనం వినుంటాం చూసి ఉంటాం.
ఇలాంటి కధను మీరు ఖచ్చితంగా ఇంతకుముందు విని ఉండరు.
కటోచ్ రాజవంశం రాజు అభయ్ చంద్ 1758 లో ఈ కోటను నిర్మించారు. ఇది హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ ఏరియాలో ఉంటుంది. ఈ కోటను సుజానేపూర్ కోట అని కూడా పిలుస్తారు.
నిధులను దాచిన కారణంగా ఈ కోటను హమీర్‌పూర్ ‘ఖాజాంచి కోట’ అని కూడ పిలుస్తారు.
ఆ తరువాత 1845 కాలంలో రాజా సంసార్ చంద్ ఈ కోటను పరిపాలించాడు.
రాజా సంసార్‌చంద్ దగ్గర వేలకోట్ల విలువైన ఖజానా ఉండేది.
శతృవుల దాడి నుంచి కాపాడుకునేందుకు ఈ కోటలో నిధిని దాచిపెట్టారని చెప్తారు.
ఖజానాకు చేరుకునేందుకు రహస్య గుహలను రాజా సంసార్‌చంద్ ఏర్పాటు చేయించాడు.
తనకు తప్ప మరెవరికీ తెరుచుకోని విధంగా ఆ ఖజానాను శాపగ్రస్తం చేశాడని అంటారు.
రాజ కుటుంబీకులకు కూడా ఈ రహస్యాన్ని రాజు చెప్పలేదని తెలుస్తోంది
ఈ నిధిని సొంతం చేసుకోవడానికి నాటి మొఘలు రాజులు నుంచి నేటి గ్రామస్తులతో సహా చాలా మంది కోటలోకి తవ్వి,
రహస్య సొరంగం మార్గంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అందరూ విఫలమయ్యారని అక్కడ దొరికిన ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది.
దారిలో అత్యంత ప్రమాదకర పాములు వారిని అడ్డుకున్నాయని, ఆధ్యాత్మిక శక్తులు నిధిని రక్షిస్తాయని.. అవే ఖజానాకు రక్షగా ఉంటాయని నమ్ముతారు.
ఈ కోటలో.. రహస్య సొరంగంతో పాటు.. దాన్ని దక్కించుకోవడానికి గుప్త నిధుల వేటగాళ్లు సాగించిన ప్రయత్నం దాని తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి.
అయినా ఈ నిధి యొక్క రహస్యం ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు ..
ఆరు నుంచి 7కిలోమీటర్ల వరకు ఈ సొరంగం ఉందని స్ధానికులు చెప్తారు.
కోట చుట్టూ నివసిస్తున్న గ్రామస్తులు రాత్రి పూట కోట నుండి వింత శబ్దాలు వస్తాయని చెబుతారు