Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు

చర్ల సెప్టెంబర్ 21(నజం చెపుతాం) మావోయిస్టులకు వ్యతిరేఖంగా ఆదివాసీ సంఘాల పేరుతో చర్ల బస్టాండ్ సెంటర్లో గురువారం కరపత్రాలు వెలిశాయి

కరపత్రాల్లో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఎందుకు జరుపు కోవాలని ప్రశ్నిస్తూ కరపత్రాల ద్వారా మావోయిస్టులకు సూటి ప్రశ్నలు ఆదివాసి గిరిజనులు కరపత్రాల్లో చంధించారు అవగాహన లేని ఏవేవో దినోత్సవాలు జరుపుకుంటూ మీటింగలకు రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు

మావోయిస్టుల వల్లే ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోవటం లేదని కరపత్రాల్లో ఆరోపించారు

ఇకనైనా మా ఆదివాసీల బతుకులు మమ్మలని బతకనివ్వండి! మమ్మల్ని ఎదగనివ్వండి! అంటూ కరపత్రాల్లో ఆరోపించారు