సంతోషి మాత దేవాలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేయాలి
*సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం 2005 వ్యవస్థాపక అధ్యక్షులు కూనపురెడ్డి సంతోష్
సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 20 నిజం చెపుతాం
సంతోషిమాత దేవాలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేయాలని సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం 2005 వ్యవస్థాపక అధ్యక్షులు కూనప రెడ్డి సంతోష్ అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత నెల రోజుల క్రితం సంతోషిమాత దేవాలయంలో జరుగుతున్న అక్రమాలపై, అమ్మవారి ఆస్తుల వివరాలను వెల్లడించానని, బ్రహ్మాండపల్లి మురళి,నూక వెంకటేశం గుప్తాల మీద రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు,జిల్లా కలెక్టర్ కు,నల్గొండ దేవదాయశాఖను, హైకోర్టును ఆశ్రయించానని త్వరలోనే వీళ్ళపై చర్యలు ఉంటాయని అన్నారు.
బ్రహ్మాండపల్లి మురళి,నూక వెంకటేశం గుప్తాలు సంతోషిమాత దేవాలయంలోని 25 మంది కమిటీ సభ్యులు ఉన్నారని, ఒక్కొక్కరి దగ్గర 25 వేల రూపాయలు తీసుకొని గుడిలో సభ్యత్వం ఇచ్చారని వాటి అన్ని వివరాలు తన దగ్గర ఉన్నావని త్వరలోనే వాటినీ బయటపెడతానన్నారు.
సంతోషిమాత దేవాలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేయకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఆపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సంతోషిమాత దేవాలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేయించే విధంగా అమ్మవారి ఆస్తులను పక్కదారి పట్టిస్తున్న కమిటీ సభ్యులపై చర్యలు తీసుకొని ఎండోమెంట్ లో కలిపే విధంగా కృషి చేయాలి అన్నారు.
గతంలో దేవాలయ బిల్లు బుక్కులు తగలబెట్టారు. ఇప్పుడు కొత్తగా తగలబెట్టిన బిల్లు బుక్కుల స్థానంలో వాటి పేరుపైన ఒక ప్రింటింగ్ ప్రెస్ లో బుక్ లను తయారు చేయిస్తున్నారని తెలిపారు.
త్వరలోనే సంతోషిమాత అమ్మవారి ఆస్తులు ఇంకా మీడియా ముందు ఉంచుతానని ఆయన తెలిపారు. సంతోషిమాత దేవాలయంలో పనిచేసే గుమస్తా బచ్చు పురుషోత్తం ప్రతి సంవత్సరం కార్తీక వన మహోత్సవనికి ప్రజలు ఫోన్ పే గూగుల్ పే కొడుతున్నారని ఇతనికి మూడు ఎకౌంట్ ల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని వాటి వివరాలను త్వరలోనే మీడియా ముందు ఉంచుతానన్నారు.
పవిత్రమైన అమ్మవారికి సేవ చేసే గుమస్తా ఇతను కొన్ని నియమాలు పాటించకుండా యదేచ్చగా తినకూడని పదార్థాలు, త్రాగకూడని పానీయాలు త్రాగే వ్యక్తి అమ్మవారికి ఏ విధంగా సేవ చేస్తారని తక్షణమే అతన్ని తొలగించాలన్నారు.
భక్తులు సంతోష్ మాత దేవాలయానికి కానుకలు ఇవ్వొద్దని ఒకవేళ ఇస్తే అవి కొంతమంది వ్యక్తుల జేబులోకి వెళ్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, రాష్ట్ర కార్యదర్శి రాపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.