జెండా ఎత్తేసిన రజనీకాంత్.. పాలిటిక్స్ కు గుడ్ బై ..

రజనీకాంత్ రాజకీయ గుడారం దాదాపుగా ఎత్తేశారు.దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా పేరున్న రజనీ, త్వరలో రాజకీయపార్టీ స్థాపిస్తానంటూ హడావుడి చేశారు.తన అభిమానసంఘాలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు.మొదట నుంచీ రాజకీయ ప్రవేశంపై సరైన స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు పార్టీ ఆవిష్కరణ వాయిదా వేస్తూ వచ్చారు.చివరికి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం లేదంటూ చెప్పేశారు.అయినా అభిమానసంఘాలతో చర్చించి తుదినిర్ణయం చెబుతానంటూ మరో మాట చెప్పారు.కొద్దినెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలో 69ఏళ్ళ రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో, ఆయన రాజకీయ ప్రవేశానికి దాదాపుగా తెరపడిపోయినట్లు కనిపిస్తోంది.ఆయనకు కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆయన బయట తిరగడం మంచిది కాదంటూ డాక్టర్లు సలహా ఇచ్చారు.