తుంగతుర్తి లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
తెలంగాణలో రామన్నది కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ తోనే తెలంగాణ రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సామెల్
హైదరాబాద్ సెప్టెంబర్ 17 నిజం చెపుతాం న్యూస్
గడిచిన 22 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో అలుపెరగని రీతిలో దళిత బిడ్డగా పార్టీ అభివృద్ధిలో పనిచేస్తూ, గడిచిన రెండు దఫాలుగా అసెంబ్లీ సీటును ఆశించినప్పటికీ, కాకపోగా.2023 లో కూడా కెసిఆర్ టికెట్ ఇస్తానని, మాయమాటలతో మోసం చేశారు. అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులని అందలమెక్కిస్తున్నారు. దీనితో ఆవేదనకు గురై బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, తన తోటి సహచరుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు తెలిపారు.
తుంగతుర్తి నియోజకవర్గం లో అవినీతి పారద్రోరడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ గెలుపును ప్రజలు నిర్ణయించారని అన్నారు. తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ పార్టీని అని అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసినట్లయితే గెలుపు సాధ్యమని అన్నారు తుంగతుర్తిలో. కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు నిద్ర కూడా పోనని అన్నారు.
పార్టీలో చేరిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేరిన పార్టీ కార్యకర్తకు ఎల్లవేళల అన్నదండగా ఉండి, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు…