సృష్టి లో విలువైన బంధం …స్నేహ బంధమే.
వేణు శర్మ కుటుంబానికి 15 లక్షల అందజేత.
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 17 నిజం చెపుతాం న్యూస్
సర్వేల్ గురుకుల పాఠశాల కు చెందిన 95 బ్యాచ్ వేణుశర్మ గారు ఇటీవల ఆకస్మిక మృతిచెందగా వారి పాఠశాల కు చెందిన సర్వేల్ ఆలుమని అసోసియేషన్ ద్వారా సేకరించిన ₹15 లక్షల రూపాయలను ఆదివారం వేణు శర్మ కుటుంబ సభ్యులకు సర్వేలు పూర్వ విద్యార్థి అయిన ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేష్ం, కోశాధికారి వివేక్, జాయింట్ సెక్రటరీ కృష్ణయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ జంపాల రాజు,
పూర్వ విద్యార్థులు బిక్షపతి , శ్రీనివాస్ , కరుణాకర్ , వాసు,మల్లిక్ , నరేష్ ,సైదులు , నాగన్న ,శ్రీను, మురళి తదితరులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ సృష్టి లో అన్నిటి కన్న విలువైన బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహ బంధం ఒక్కటే మరణానంతరం కూడా దానికి విడదీయరాని బంధం ఉంది కాబట్టే నేడు స్నేహితులందరూ కలిసి ఇంత పెద్ద మొత్తాన్ని సేకరించి ఆ కుటుంబానికి అందచేసి, కుటుంబానికి చేయూత నివ్వడం అనేది గొప్ప సందర్భం… మనిషి పక్కన ఉన్నప్పుడే కాకుండా మన నుండి దూరమైనా స్నేహితుడు వేణు శర్మ కుటుంబానికి తోడుగా నిలిచిన సర్వేల్ ఆలుమని అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.