శవంతో దుబ్బ తండాలో జైపాల్ నాయక్ ఇంటి ముందు నిరసన
మాడ్గుల సెప్టెంబర్ 16(నిజం చెపుతాం): మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన కడారి మహేష్ దుబ్బ తండాకు చెందిన జైపాల్ నాయక్ గత పది రోజుల క్రితం రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి నర్సంపల్లి,ఆర్కపల్లి మధ్యలో ఢీకొనడంతో గాయాలైన ఇద్దరు వ్యక్తులను హైదరాబాదులోని ఓ వైద్యశాలకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతు నర్సంపల్లి గ్రామానికి చెందిన కడారి మహేష్ గురువారం మృతి చెందాడు.పలు రకాల అనుమానంతో మహేష్ బంధువులతో పాటు గ్రామస్తులు మృతదేహాన్ని దుబ్బ తండాలోని బైక్ ప్రమాదంలో గాయపరిచిన జైపాల్ నాయక్ ఇంటి ముందు ఈనెల 16 సాయంత్రం నుండి 17 ఉదయం 11 గంటల వరకు బంధువులతో పాటు గ్రామస్తులు జైపాల్ నాయక్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు.
సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పి మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య నర్సంపల్లి గ్రామానికి తరలించారు.
నర్సంపల్లి గ్రామస్తులు శవాన్ని రోడ్డుపై ఉంచి మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేసే అంతవరకు దహన సంస్కారాలు చేసేది లేదని బంధువులతో పాటు గ్రామస్తులు పోలీసులకు సవాలు విసిరారు.
సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ మృతుని కుటుంబ సభ్యులతో, ప్రమాదంలో గాయపరిచిన సంబంధిత వ్యక్తులతో పలు దాపాలు జరిపిన చర్చలు పాలించకపోవడంతో మండల పోలీసులతో పాటు బెటాలియం గ్రామంలో మోహరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హనుమ నాయక్ తో పాటు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నల్లకాసుల పెద్ద యాదవ్ లు మాట్లాడుతు మృతుని కుటుంబానికి న్యాయం చేయవలసిన పోలీసులు ప్రమాదంలో గాయపరిచిన వ్యక్తులకు ప్రొడక్షన్ కల్పించడం ఎంతవరకు సమాజసం అని వారు పోలీసులను ప్రశ్నించారు.
ఇప్పటికైనా పోలీసుల తీరు మార్చుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.