ADITYA L1: 4వ భూ కక్ష పెంపు విజయవంతం…
భారతదేశం ఇప్పటికే చంద్రయాన్ 3 త్రినే చంద్రుడు పై దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేసిన తొలి దేశంగా ఒక చరిత్ర సృష్టించింది.. చంద్రయాన్త్రీ విజయవంతమై భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది..
అయితే భారతదేశం యొక్క పరిశోధన కేంద్రమైన ఇస్రో సూర్యుడిని పరిశోధించేందుకు పంపిన ఆదిత్య L 1 విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే..
సూర్యుడిపై పరిశోధనలు చేసేం దుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదిత్య ఎల్ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్. మీషన్ను మోసుకొని రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఈ మిషన్ విజయవంతంగా కొనసా గుతోంది. ఒక్కో దశను సక్సెస్ఫుల్ దాటుకుంటూ వ్యోమనౌక సూర్యుడివైపు దూసుకెళ్లింది.
ఇప్పటి వరకు ఇస్రో శాస్త్రవేత్తలు మూడుసార్లు ఆదిత్య ఎల్ మిషన్ కేక్ష్యను పొడిగించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి ఆదిత్య ఎల్ స్పేష్ షిప్ కక్ష్యను పొడిగించారు.
ప్రస్తుతం 256కి.మీX 121973 కి.మీ దూరం లో ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగోసారి కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. కక్ష పొడి గిస్తున్న సమయంలో ఆదిత్య ఎల్ శాటిలైట్.. బెంగళూరు, మారిష స్, పోర్టు బ్లెయిర్లో ఉన్న ఇస్రో స్టేషన్లు ట్రాక్ చేశాయని తెలిపారు. ఇక ఐదోసారి కక్ష్య పొడిగింపు ప్రక్రియను సెప్టెంబర్ 19న ఉదయం 2 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం ఆదిత్య ఎల్1 శాటిలైట్ విజయవంతంగా లాంగ్రేజ్ పాయింట్ వైపు దూసుకెళ్లింది. ప్రయోగం చేపట్టినప్పటి నుంచి మొత్తం 125 రోజు ల పాటు స్పేషప్ 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఆ తర్వాత లాంగ్రేజ్ పాయింట్ వద్ద ఉండే దీర్ఘవృత్తాకార కక్షలోకి ప్రవే శిస్తుంది.
ఆదిత్య ఎల్వన్లో మొత్తం 7 పేలోడ్ శ్రీ శాస్త్రవేత్తలు అమర్చారు ప్రతి ఒక్క ప్లేలోడు సెన్సార్లు ఒక్కొక్క దానిపై పరిశోధనలు చేయనున్నాయి.. ఈ పరిశోధన చేయడం వల్ల సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చని అలాగే సౌర తుఫానులు వచ్చినప్పుడు ఎలా బయటపడాలని సూచనల కోసం ఈ మిషన్లు చేపట్టారు..
సూర్యుడిని పరిశోధన చేయడానికి వెళ్ళిన దేశాలలో భారతదేశం ఒకటి.. ఈ ఆదిత్య ఎల్ వన్ మిషన్ పూర్తిగా 125 రోజులు ఉంటుందని ఆ తర్వాత ఇది 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్ వన్ అనే పాయింట్ వద్ద ఆగి సూర్యుడిని పరిశోధన చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు..