లంచాలకు నిలయంగా మారిన మానుకోట సబ్ రిజిస్టార్ ఆఫీస్…?
__ఉన్నతాధికారులకు అవినీతి కనిపించడం లేదా?
__ నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా?
__ప్రజలను జలగల్ల పట్టిపీడిస్తున్న ఈ అవినీతి అధికారుల అంతం ఎప్పుడో ?
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 16,( నిజం న్యూస్):
మహబూబాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లంచాలకు నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కు లంచం ఇవ్వాల్సిందే.
మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ వివిధ రకాల కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లకు రేటు నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేసుకునే వారి చెవులు పిండి వసూలు చేస్తున్నారు.
బీదవారు ఎవరైనా అంత ఇవ్వలేమని అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటులో ఇది లేదు, అది లేదు, అది చేయించుకుని రండి అంటూ కొర్రీలు పెడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఎన్ని సార్లు తిరగాలి అని వారు చెప్పిన రేటుకు బలి ఐ ( ఇచ్చి) రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
ఇటీవల సబ్ రిజిస్టర్ ఏఏ రిజిస్ట్రేషన్ లకు ఎంత లంచం తీసుకోవాలో ఒక రేటు నిర్ణయించినట్లు తెలిసింది.
1) పాత ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే గజం ఒక్కంటికి 50 రూపాయలు, ఉదాహరణకు 500 గజాలు ఉంటే 500×50=25000,
2) అదే గ్రామపంచాయతీ నెంబర్ తో ఇంటి రిజిస్ట్రేషన్ అయితే 100 రూపాయలు గజం ఒక్క ఇంటికి 500×100=50000,
3) పట్టణ మున్సిపాలిటీ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే గజం ఒక్కంటికి 150 రూపాయలు, 500×150=75 000,
4). నాలా సర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రేషన్లకు గజం ఒక్కంటికి 200 రూపాయలు, అవసరాన్ని బట్టి 300 రూపాయలు సైతం గజానికి ఒక్కంటికి తీసుకుంటున్నారు.
500×200=100000 రూపాయలు, ఇది మానుకోట సబ్ రిజిస్టర్ నిర్ణయించిన అనాథరైజ్డ్ (గవర్నమెంట్ కు కట్టేది కాక) రేట్ల పట్టిక. ఈ విధమైన ధరలు నిర్ణయించి మానుకోట సబ్ రిజిస్టర్ నిర్బంధ వసూలు చేస్తున్నారు.
ఇది ఏమిటని ఎవరైనా అడిగితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కొర్రీలు పెడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు మానుకోట సబ్ రిజిస్టార్ ఆఫీసులో తీసుకునే లంచాలు కనిపించడం లేదా? లేదా వారికి కూడా ఈ లంచాలలో భాగస్వామ్యం ఉండకుండా ఎందుకు ఉంటుందని రిజిస్ట్రేషన్ దారుల ఆరోపణ.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లపై చేతి ముద్రలు వేయించి, స్టాంపు ముద్రలు వేసే అటెం డరుకు రోజువారి వచ్చే లంచం ఇన్కమ్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి.
ఉదాహరణకు మానుకోట సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజులో 100 రిజిస్ట్రేషన్లు జరుగుతే ఒక్కో రిజిస్ట్రేషన్కు 200 చొప్పున (ఫిక్స్డ్ రేట్) తీసుకుంటాడు. అంటే రోజుకు ఇతను ఆదాయం 20,000 రూపాయలు. సీజన్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించుకునే వ్యక్తిగా అటెండర్ను పలకరి స్తే సార్! నేను ఇంటర్మీడియట్ చదివి అటెండర్ గా వచ్చాను.
అప్పటినుండి ఇక్కడే ఉన్నాను. మరి మీకు క్లర్క్ గా ప్రమోషన్ వచ్చింది కదా ఎందుకు పోలేదు అని అడుగుతే ,సార్ అటెండర్ గా ఉండే ఆదాయం క్లర్క్ సీట్లు లేదు. అందుకే ప్రమోషన్ వదులుకున్నాను. మాకు ఆరు నెలల జీతాలు రాకపోయినా పర్వాలేదు అంటూ ఎంతో ఉత్సాహంగా బదిలించాడు.
అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే అటెండర్ కి అంత ఇన్కమ్ ఉంటే ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు చేసే సబ్ రిజిస్టార్ల పరిస్థితి ఊహించుకోండి. నమ్మకమైన ఒక వ్యక్తి (సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉండే ఉద్యోగి)నీ తన వద్ద ఉంచుకొని రిజిస్ట్రేషన్లు చేయించే వ్యక్తుల వద్ద నుండి నమ్మకమైన ఉద్యోగి సాయంత్రం అందరి వద్ద నుండి పైన తెలిపిన లెక్కల ప్రకారం డబ్బులు వసూలు చేస్తాడు.
మరికొందరు ఆఫీసులోనే ఇస్తారు. జిల్లాలోని ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంత పెద్ద మొత్తంలో లంచాలు చేతులు మారుతున్న నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిరోజు ( సెలవు దినాలు తప్ప) లక్షలాది రూపాయలు లంచాల రూపంలో జలగళ్లపట్టి వసూలు చేస్తున్న వీరి నుండి రిజిస్ట్రేషన్ చేయించుకునే వినియోగదారులకు విముక్తి లేదా? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న గా మిగులుతుందా?
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నిఘా సంస్థలు ఈ సబ్ రిజిస్టర్ ఉద్యోగులపై నజర్ పెడుతుందో లేదో చూద్దాం.