ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చిన కలిసి పని చేస్తాం.
రామచంద్రనాయక్,నెహ్రూ నాయక్ ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చిన కలిసి పని చేస్తాం.
వీరభద్రస్వామి ఆలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు.
పీసీసీ&రాష్ట్ర ఆదివాసుల వైస్ చైర్మన్ మాలోతు నెహ్రూ నాయక్.
కురవి,నిజంచెపుతాం,సెప్టెంబర్,15:
కురవి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న, పీసీసీ&రాష్ట్ర ఆదివాసుల వైస్ చైర్మన్ మాలోత్ నెహ్రునాయక్, వీరభద్రస్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు.తదినంతరం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ గడ్డపై జెండా ఎగరడం ఖాయమన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ వచ్చే జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. డోర్నకల్ ప్రజలు నన్ను రాబోయే ఎలక్షన్లలో ఆశీర్వదించాలని కోరారు. డోర్నకల్ లో నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ డాక్టర్ రామచంద్రనాయక్,నెహ్రూ నాయక్ ఇద్దరిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామన్నారు. ఇందులో డోర్నకల్ నుంచి వర్గ విభేదాలు లేవని కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుల పనిచేయాలన్నారు.నియోజకవర్గంలోని నాయకులలో మూడో వ్యక్తి లేరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బాధ్యులు వద్దుల మహేందర్ రెడ్డి,నాయకులు బాదె వీరభద్రం,శ్యామల శ్రీనివాస్,ఇ.వెంకన్న,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.