డోర్నకల్ నియోజకవర్గ ప్రచారంలో దూసుకుపోతున్న భూపాల్ నాయక్
_సుడిగాలి పర్యటనలో నాయక్.
_మండలాలు త oడాలలోని ప్రజలను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో ముందున్న నాయక్.
_కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న పూర్తి భరోసా.
_పార్టీ ప్రచారంలో ముందున్న భూపాల్ నాయక్.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15,( నిజం న్యూస్):
రాబోయే ఎన్నికలలో డోర్నకల్ నియోజకవర్గం నుండి పోటీలో ఉండే అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ నుండి ననావత్ భూపాల్ నాయక్ ఒకరు. గత నాలుగు నెలల నుండి నియోజకవర్గo మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల బాధలే తనవిగా భావిస్తూ, వస్తున్న భూపాల్ నాయక్.
తన నియోజకవర్గ సుడిగాలి పర్యటనను తట్టుకోలేక తన సమావేశాలకు వచ్చే ప్రజాస్పందన చూసి ఓర్వలేక తనపై అవాకులు, చవాకులు పేరుతో బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్న వారికి, తన సభలకు వచ్చే ప్రజానీకమే నిదర్శనమని భూపాల్ నాయక్ తీవ్రంగా విమర్శించారు.
డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆ మెడ దూరంలో ఉంది. తండాలకు సరైన రోడ్ల సౌకర్యం లేదు. మారుమూల గ్రామాల అభివృద్ధి శూన్యం. నిరుద్యోగ సమస్య విలయతాండవం చూస్తుంది.
నియోజకవర్గంలో అభివృద్ధి “ఎక్కడ వేసిన గొంగళి” అక్కడే, ఉంది. ఇవన్నీ చూసి చలించిపోయిన భూపాల్ నాయక్ ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు .
భూపాల్ నాయక్ ఇక్కడి వాడు కాదు. అని దుష్ప్రచారం చేస్తున్న వారికి నా సమాధానం ఒక్కటే. ఇందిరా గాంధీ మెదక్ లో పుట్టిందా? ఆమె అక్కడి నుండి పోటీ చేసి ఎంపీగా గెలవలేదా? మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మహబూబాబాద్ వ్యక్తా? అతను రెండు సార్లు గెలిచి మూడవసారి అభ్యర్థిగా నిలబడటం లేదా? భారతదేశంలో పుట్టి ఉంటే చాలు
.దేశంలో ఎక్కడినుండి అయినా పోటీ చేయవచ్చని ఈ కుహాన రాజకీయ రాబందులకు తెలియదా?. భూపాల్ నాయక్ మీద ఈర్ష్యా ద్వేషాలతోనే ఈ నియోజకవర్గంలో తాను గెలిచి ఎక్కడ అభివృద్ధి చేస్తానో అని నోరు పారేసుకుంటున్న తెలివి తక్కువ రాజకీయ నాయకులకు ఇదే నా సమాధానం.
నా పేరు లోనే ఉంది” భూపాల్ నాయక్”అంటే “భూమిని పాలించే నాయకుడు”బరాబర్గా డోర్నకల్ నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం. గెలుపొందడం ఖాయం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఖాయం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపడం ఖాయం.
నేను పేదరికం నుండి వచ్చాను. చిన్నప్పుడు కష్టాలు చవి చూశాను. అనే విషయాన్ని కూడా విమర్శిస్తున్న, ధన బలంతో బలిసిన రాజకీయ నాయకులకు సామాన్యుడి కష్టం విలువ తెలిస్తే అలా మాట్లాడరని భూపాల్ నాయక్ ఘాటుగా విమర్శించారు.
భూపాల్ నాయక్ ఎవరు? అని ప్రజలుచర్చించుకుంటున్నారంటే, నా గురించి ప్రజాస్పందన ఉన్నట్లే కదా, తన వ్యక్తిగత భద్రతపై విమర్శలు చేస్తున్న కుహాన వ్యక్తులను విమర్శిస్తూ, ఎమ్మెల్యే, ఎంపీ ఇతర రాజకీయ వ్యక్తులు ప్రచారానికి గాని, ప్రజల్లోకి గాని, వస్తే వారికి భద్రత ఇవ్వడం లేదా? నేను కూడా నా వ్యక్తిగత భద్రత చూసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.
చిన్న గూడూరులో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన సందర్భంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడి కను సన్నలలో నడిచే వ్యక్తులు చేసిన యాగి మాత్రమే అది అని భూపాల్ నాయక్ కొట్టి పారేశారు.
అభివృద్ధికి, నిరుద్యోగానికి దూరంగా ఉన్న డోర్నకల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచడానికి వచ్చిన భూపాల్ నాయక్ పై కొందరు, కొన్ని రాజకీయ పార్టీల వారు, తెలివి లేని విమర్శలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.