జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల
కురవి,నిజంచెపుతాం,సెప్టెంబర్,14:
డోర్నకల్ లో జరిగిన జోనల్ స్థాయి క్రీడ ఉత్సవాలలో అండర్ 17సం”అండ్ అండర్ 14 సం”బాలికల విభాగంలో కబాడీలో 17 సం”కురవి మండల ప్రథమ స్థానం గెలవడం జరిగింది.14 సంవత్సరాల విభాగంలో కబాడీలో ప్రథమ స్థానం గెలుపొందారు.
యు-17 సంవత్సరాలు కోకో లో ద్వితీయ స్థానం ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలోని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది.
అండర్ 17సం”కబాడీలో బి.నందిని అండర్ 14 సం”రాల విభాగంలో డి.నవ్య బి.వల్లి,ఖోఖో లో బి.హారికల ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం,బి.వెంకన్న,హెచ్ డబ్ల్యూ ఓ,పద్మ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…గిరిజన పాఠశాల ఆశ్రమ బాలికల ప్రతిభను వెలికి తీసినందుకు పి.డి అనిల్ కుమార్ ను అభినందించారు.అలాగే జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం జి.బద్రు,సి సి హెచ్ రవి,బి. మంగీలాల్,జి.రమేష్,జి.ధర్మ,బి.కారం చందు,జె.గోవర్ధన్ బి.శీను బి. నాగమణి(ఏఆన్ఎం)లు పాల్గొన్నారు.