మంత్రి హరీష్ రావు గారిని కల్సి మహారాష్ట్ర లోని 42 గ్రామాలు తీర్మాన కాపీలు ఇచ్చిన నాందేడ్ జిల్లా వాసులు..

 

మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రం లో కలపండి.. మాకు మీ సంక్షేమ పథకాలు వర్తించేల చూడాలి అని గురువారం నాడు మహారాష్ట్ర వాసులు మంత్రి హరీష్ రావు గారిని సిద్దిపేట లో కలసారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42గ్రామాలు తెలంగాణ రాష్ట్రం లో కలపాలి అని మంత్రి హరీష్ రావు గారని కల్సి మన్నారు..మహారాష్ట్ర లో మేము ఉన్నట్టే కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు.. పథకాలు లేవు.. తెలంగాణ లో సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ లో అద్భుతమైన సంక్షేమ పథకాలు చేస్తున్నారు అని చెప్పారు.. కల్యాణ లక్ష్మీ ,కేసీఆర్ కిట్, రైతు బంధు , ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారు.. మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రం లో కలపాలి..ఆ పథకాలు మాకు వర్తింప జేయాలి అని వారు కోరారు.. 42 గ్రామాలు తీర్మానం చేసిన కాపీలను మంత్రి హరీష్ రావు గారికి అందజేశారు.. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని , తెలంగాణ సంక్షేమ పథకాల అమలు పట్ల మీరు చూపించిన స్పూర్తి అభినందనియం అని మంత్రి హరీష్ రావు గారు తెలిపారు.. సీఎం కేసీఆర్ గారి దృష్టి కి తీసుకెళ్తనని చెప్పారు…మంత్రి హరీష్ రావు గారిని కల్సిన వారిలో రాజ్ లింగారెడ్డి , శంకర్ శెట్టి , బాలాజీ తదితరులు ఉన్నారు…