Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తూర్పున పొడిచిన జనసేన, తెలుగుదేశం పొత్తు

తూర్పున పొడిచిన జనసేన, తెలుగుదేశం పొత్తు

తూర్పుగోదావరి జిల్లా (రాజమండ్రి)

సెప్టెంబర్ 14..(చల్లా శ్రీనివాస్.. నిజం రిపోర్టర్ )నిజం న్యూస్..

*తెలుగుదేశం తో కలిసి పోటీచేస్తామని స్పష్టం చేసిన జనసేనాని

*చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని ప్రకటన

*చంద్రబాబుతో ములఖత్ లో ఆరోగ్య,భద్రత విషయాలు ప్రస్తావన

*జనసేన,తెలుగుదేశం పార్టీలతో పాటు బీజేపీ కూడా పొత్తులో ఉండే

అవకాశం ఉందని సంకేతాలు

*తాను ప్రస్తుతం బీజేపీ సంకీర్ణ కూటమి ఎన్డీఏలోనే కొనసాగుతున్నానని స్పష్టికరణ

*చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించిన పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా మరోసారి రాజకీయ రంగానికి వేదికగా నిలిచింది.తూర్పు అంటేనే మార్పు అని అభివర్ణించే రాజకీయ విశ్లేషకుల మాటలకు ఊతమిస్తూ తూర్పున ములఖత్ సాక్షిగా జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడిచింది.

స్కిల్ స్కాం అభియోగాలపై అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ నందు ఉన్న నేపథ్యంలో గురువారం చంద్రబాబును జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కీలక నేత,హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ములఖత్ లో భాగంగా కలిసారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలు ప్రస్తావించారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో పోటీ చేస్తాయని, ఈ భాగస్వామ్యం లో బీజేపీ కూడా చేరాలని తాను కోరుకుంటున్నానని, ప్రత్యేక హోదా విషయంలో తాను రాజకీయంగా చంద్రబాబుతో విభేదించానని, అయితే చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, చంద్రబాబు అపార అనుభవం ఉన్న నాయకుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి మరిచిపోలేనిదని పేర్కొన్నారు.

అధికారులు కూడా నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వహించాలని రాష్ట్ర పరిస్థితులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమితాషా దృష్టికి తీసుకునివెళతానని,అలాగే చంద్రబాబు భద్రత విషయం కూడా కేంద్రంతో ప్రస్తావిస్తానని పేర్కొంటూ ముఖ్యమంత్రి జగన్ కుట్ర పూరిత చర్యలకు తెరతీసి చంద్రబాబును అరెస్ట్ చేసారని,

వైసిపీ ప్రభుత్వానికి ఇంకా ఆరు నెలలు మాత్రమే మనుగడ ఉందని,రాబోయే ఎన్నికలలో ప్రభుత్వ మార్పు తథ్యమని పేర్కొన్నారు.