Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అందరివాడయ్యా …..మోత్కుపల్లి !

కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న మోత్కుపల్లి నరసింహులను చూసి ఆశావాదుల్లో గుబులు…. టికెట్ వస్తే.. పదివేల మెజార్టీ కాయం

అన్ని రాజకీయ పార్టీ నాయకులు ,మెచ్చిన నాయకుడు మోత్కుపల్లి.

మాదిగ సామాజిక వర్గంలో….. పెద్దన్న పాత్ర..

హైదరాబాద్ సెప్టెంబర్ 13 నిజం చెపుతాం న్యూస్

రాజకీయ ప్రస్తావనం….

మోత్కుపల్లి నర్సింహులు 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మోత్కుపల్లి నర్సింహులు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయాడు.

తెలంగాణ ఏర్పాటుపై టిడిపి అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనను వ్యక్తంచేయడంతో 2018, మే 28న తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లిని బహిష్కరించారు.మోత్కుపల్లి నర్సింహులు 4 నవంబరు 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి,23 జులై 2021న రాజీనామా చేశాడు.

మోత్కుపల్లి నర్సింహులు 18 అక్టోబర్ 2021న తెలంగాణ భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. ఆశించిన రీతిలో పదవి రాకపోవడంతో గత కొంతకాలంగా పార్టీలో ఉన్నప్పటికీ ,నిరాశ నిస్సృహాలకు లోనై, తన తోటి నాయకులు, కార్యకర్తల ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

తుంగతుర్తి నియోజకవర్గం లో మాదిగ సామాజిక వర్గంలో చైతన్యం నింపిన నాయకుడుగా మోత్కుపల్లిని వర్ణించవచ్చు.

తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం 66 వేల పైచిలుకు మాదిగ సామాజిక ఓటర్లు ఉన్నది విధితమే. ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీటవేయాలని , అసెంబ్లీ సీటు ప్రకటించాలని, ఎన్నో ఉద్యమాలు బహిరంగంగా… చేస్తున్నారు.

ఇటువంటి తరుణంలో మాదిగ సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి నరసింహులు చేరడం జరిగితే… శుభప్రదంగా చెప్తున్నారు.

ఏ పార్టీలో ఉన్న శత్రువులైన తన వైపు తిప్పుకొని… తన వైపు నడిపించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న.. ధైర్యశీలి… మోత్కుపల్లి నరసింహులు .కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు అంటే కొంతమంది ఆశావాదులు… పార్టీలో చేరితే మాకు ఏమి నష్టం లేదని…. టికెట్ మాత్రం ఇవ్వద్దని… సోషల్ మీడియాలో మాటలు మాత్రం…. చెక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీని….

ఈనెల 17న ఏఐసీసీ నాయకురాలు, తెలంగాణ సృష్టికర్త, సోనియాగాంధీ హైదరాబాదులోని బహిరంగ సభలో… మోత్కుపల్లి నరసింహులు తో పాటు, పలువురు, రాటు తేలిన రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలియజేస్తున్నది.

ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. కష్టాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో.. ఆశతో… మూడవసారి ముచ్చటగా గెలుస్తామని…. ధీమాతో ఉంటూ.. ఎంతోమంది ఆశావాదులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ..

అధిష్టాన నిర్ణయమే అంతిమ నిర్ణయం కాబట్టి…. మాదిగ సామాజిక వర్గ నాయకులకి.. అసెంబ్లీ టికెట్టు ప్రకటిస్తే… భారీ మెజార్టీ ఖాయమంటూ.. నియోజకవర్గం లో గుసగుసలు పెడుతున్న ప్రజలు… కాంగ్రెస్ అధిష్టానం.. మరి టికెట్ ఎవరికీ కట్టబెడుతుందో.. ఎవరికో.. వేచి చూద్దామా మరి…