లైంగిక కోరిక తీర్చనందుకే హత్య
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్
౼ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచిన పోలీసులు
౼ నిందితులు ఉడెంగడ్డ లక్ష్మీగూడ వాసులు
౼ కేసు వివరాలను వెల్లడించిన సీఐ లక్ష్మారెడ్డి
౼ ఫామ్ హౌస్ లలో తెలిసిన వారినే పనిలో పెట్టుకోవడం శ్రేయస్కరం
చేవెళ్ల, సెప్టెంబర్ 12 (నిజం న్యూస్) :
చేవెళ్ల మండల కేంద్రంలోని కనకమామిడి మల్లారెడ్డి మరియు అతని స్నేహితులకు చెందిన ఫామ్ హౌస్ లో ఆదివారం వెలుగు చూసిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు చేవెళ్ల సిఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన కనకమామిడి మల్లారెడ్డి అతని స్నేహితులకు చెందిన ఫామ్ హౌస్ లో ఉడెంగడ్డ లక్ష్మీగూడకు చెందిన సత్య, కల్పన దంపతులు పనిచేస్తున్నారు.
వారు గురువారం మొహినాబాద్ లోని కళ్లు దుకాణం వద్దకు వెళ్లగా అక్కడ వికారాబాద్ జిల్లా మద్గుల్ చిట్టంపల్లికి చెందిన శివనీల, సంపత్ లు అప్పటికే కల్లు త్రాగుతూ మాట్లాడుకుంటుండగా వారితో మాటలు కలిపారు. అంతకు ముందే మృతురాలు శివనీల, సంపత్ ల మధ్య పరిచయం ఏర్పడి వారు ఇద్దరు భార్య భర్తలుగా ఉందమని నిర్ణయించుకున్నారు.
పనికోసం వెతుకుతున్న వారికి వారు పనిచేసే దగ్గర పని ఉందని, పని ఇప్పిస్తామని నమ్మజెప్పి నేరస్తులు సత్య, కల్పన వారి వెంట ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. ఫామ్ హౌస్ లో అందరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న మద్యంను సేవించారు. అప్పటికే కల్లు తాగడం మూలంగా నేరస్తురాలు కల్పన నిద్ర పోయింది.
ఆ తర్వాత నేరస్తుడు సత్య, మృతురాలు శివనీల, సంపత్ ముగ్గురు మద్యం సేవిస్తున్న సమయంలో నేరస్తుడు మృతురాలు పైన లైంగిక పరమైన కన్నేశాడు. దాంతో సంపత్ కు 500 రూపాయలు ఇచ్చి మద్యం తీసుకురమ్మని చెప్పి పంపాడు. తను వెళ్లాక సత్య శివనీలతో తన లైంగిక కోరిక తీర్చాలని కోరాడు.
దానికి మృతురాలు శివనీల ఒప్పుకొని తన కోరిక తీర్చాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరగా దానికి నేరస్తుడు సత్య ఒప్పుకున్నాడు. ఆ తరువాత వారు ఒక రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ లో మునిగిపోయి సత్య ఆమె పైన లైంగిక పరమైన క్రీడ చెయ్యబోగా శివనీల అతన్ని దూరంగా నెట్టేసి ముందు డబ్బులు ఇచ్చాకే తనను అనుభవించాలని చెప్పింది.
అందుకు నేరస్తుడు సత్య ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడైతే తన కోరిక తీర్చమని చెప్పగా అందుకు మృతురాలు అంగీకరించకపోవడంతో నేరస్తుడు సత్య ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నం చేయగా, మృతురాలు అతనికి సహకరించకుండా అతన్ని నెట్టేయడంతో అతను ఆమె చెంప మీద బలంగా కొట్టాడు.
దానికి ఆమె అరవడంతో నిద్రిస్తున్న తన భార్య ఏమైనా నిద్రలేచిందేమోనని కిటికీలో నుండి చూసే లోపు మృతురాలు ఫామ్ హౌస్ నుండి పరుగులు తీయగా, అది చూసిన నేరస్తుడు అక్కడే ఉన్న కర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దాంతో ఆమె కింద పడిపోయి ఏడుస్తూ ఉండడంతో అదే కర్రతో మరోసారి తలపై బలంగా మోదాడు.
ఆమె ఏడుపుల శబ్దం ఎవరైనా వింటారనే భయంతో అక్కడే ఉన్నటువంటి బట్టలాంటి తాడుతో ఆమె మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. మద్యం తీసుకురావడానికి వెళ్లిన సంపత్ తిరిగి ఫామ్ హౌస్ కి వస్తాడని ముందే అప్రమత్తమై నేరస్తుడు సత్య ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్లి సంపత్ కు కొద్ది దూరం ఎదురువెళ్లి శివనీల ఫామ్ హౌస్ నుండి వెళ్లిపోయిందని, నీవు కూడా వెళ్ళిపో అని, అతనితో గొడవపడి పంపించేశాడు.
నేరస్తుడు సత్య తిరిగి ఫామ్ హౌస్ కి వచ్చి మృతురాలి శవాన్ని ఏమి చేయాలో అర్థం కాక ఫామ్ హౌస్ లో ఉన్న గడ్డపార, సహాయంతో వాచ్ మెన్ రూమ్ ముందు భాగంలో రెండు ఫీట్ల లోతు మట్టి తవ్వి శవాన్ని గుంతలో పూడ్చేశాడు. పూడ్చేసిన పిదప తవ్విన మట్టిపై బండలను పరిచాడు.
మృతురాలి శవాన్ని పాతిపెట్టే సమయంలో ఆమె మెడలో ఉన్న బంగారు పూస్తేను దొంగలించాడు. ఆ తర్వాత మృతురాలిని హత్య చేయడానికి, పూడ్చి పెట్టడానికి ఉపయోగించిన కర్ర, గడ్డపార, పారలను ఫామ్ హౌస్ లో గల రేకుల షెడ్డు నిర్మాణం వెనకాల దాచాడు.
అనంతరం ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు శుక్రవారం తెల్లవారుజామున నిద్ర లేచిన కల్పన, నేరస్తుడు సత్యను సంపత్ , మృతురాలు శివనీల గురించి అడగగా వారు రాత్రి వెళ్లిపోయారని బదులిచ్చాడు. వారి రూమ్ డోర్ వరకు మట్టి ఉండడం రూమ్ ముందుగల బండలు కదిలించినట్లుగా ఉండడంతో అనుమానం వచ్చి నేరస్తుడిని నిలదీయగా అతను ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్పి మృతురాలను పాతిపెట్టిన విషయాన్ని చెప్పినాడు.
ఆ తర్వాత ఇక్కడే ఉంటే ఎలాగైనా విషయం బయటకు వచ్చి దొరికిపోతామనే భయంతో శవాన్ని పాతిపెట్టిన స్థలాన్ని శుభ్రం చేసి వారి వస్తువులను తీసుకొని మల్లారెడ్డి వద్దకు వెళ్లి తమ ఇంటి దగ్గర గొడవలు జరుగుతున్నాయని మళ్లీ వస్తామని చెప్పి అక్కడ పని మానేసి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మృతురాలి శవాన్ని పాతి పెడుతున్న సమయంలో ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం నుండి దొంగిలించిన బంగారు పుస్తెను ఉడెంగడ్డ, మైలార్ దేవులపల్లిలో గల బంగారం షాపులో నేరస్తురాలి పేరుతో 5000 రూపాయలకు తాకట్టు పెట్టారు.
ఫామ్ హౌస్ యజమానుల ఫిర్యాదు మేరకు హత్య జరిగిన స్థలానికి తహసిల్దార్, డాక్టర్ తో వెళ్లి మృతురాలు హత్య గావించబడిందని నిర్ధారణ చేసుకున్నమన్నారు.
చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈరోజు నిందితులను, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరిచామని సీఐ లక్ష్మారెడ్డి వివరించారు.
ఫామ్ హౌస్ లలో తెలిసిన వారిని పనిలో పెట్టుకోవాలని సీఐ సూచించారు.
విలేకరుల సమావేశంలో ఎస్సై వీరభద్రం మరియు కానిస్టేబుల్స్ రవికుమార్, సురేష్, నర్సింలు, నాగమల్లేశ్వర్ రెడ్డి, ప్రభాకర్, శాంతి బాబు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.