ఉద్యోగం రాక మనస్థాపనతో యువకుడు…
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
ఉద్యోగం రాక మనస్థాపనతో ఈ ఘటన
గరిడేపల్లి సెప్టెంబర్ 12 (నిజం చెపుతాం)
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఎర్రకుంట గ్రామంలో జరిగింది. గరిడేపల్లి ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం యర్రకుంట గ్రామానికి చెందిన కట్టా సందీప్ వయసు. 23 సం లు,
బీటెక్ పూర్తి చేసి గత కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూన్నాడు.కానీ ఉద్యోగం దొరకక పోవడంతో గత 20 రోజుల క్రితం తన సొంత గ్రామానికి వచ్చి ఇంటి వద్ద కొంత ఆ సౌకర్యంగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది
సోమవారం రోజు సుమారు మధ్యానం 03.00 గంటల సమయంలో ఇంటిలో ఎవరు లేని సమయంలో తన ఇంటిలో ఇనుప రాడ్డు కు చీరతో ఉరి వేసుకొని మరణించినాడు.
అని అతని తల్లి కట్టా కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతున్నది అని యస్ ఐ వెంకట్ రెడ్డి తెలిపినారు