Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను పట్టుకున్న మరిపెడ పోలీసులు

06- బైక్ లు స్వాధీనం. మొత్తం విలువ రూ. 2,40,000/-

మరిపెడ సెప్టెంబర్ 11 నిజం న్యూస్

సోమవారం రోజున మరిపెడ పోలీస్, గతంలో జరిగిన సంబంధించిన కేసులలో అనుమానితుల గురించి వెతుకుచుండగా, రాజీవ్ గాంధీ సెంటర్, మరిపెడ బంగ్లా వద్ద వాహనాలు తనికి చేస్తున్న పోలీస్ వారికి ఒక వ్యక్తి బైక్ పై అనుమానాస్పదంగా వెళ్ళుచుండగా వెంబడించి పట్టుకోవడం జరిగింది విచారణలో మరో వ్యక్తిని పట్టుకోవడం జరిగింది.

వారి పేర్లు :

ఏ1)రెంటల నాగేంద్రబాబు . నాగబాబు తండ్రి వీరాస్వామి, వయస్సు: 31 సం.లు, కులం: మాల, వృత్తి పెయింటర్ ఊరు పాత రామన్నపేట, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఏపీ, ఎన్/ ఓ రాంపురం గ్రామం, మరిపెడ మండలం

2. కాగితపు రాంబాబు తండ్రి వెంకన్న, వయస్సు:36సం.లు, కులం : మాల, వృత్తి : సుతారి మేస్త్రి ఎడ్జెర్ల గ్రామం, మరిపెడ మండలం

ఫై ఇద్దరు వ్యక్తులలో ఏ1 గత 10 సంవత్సరాల నుండి జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాచలనతో ఆంధ్ర లోని వివిధ రైల్వే స్టేషన్ల లలో దొంగతనాలు చేసి పలుమార్లు నిందితుడు ఏ1 రాజముండ్రి, విజయవాడ మరియు తెనాలి జైళ్ళకు వెళ్ళాడు.

గత సంవత్సరం క్రితం జైలు నుంచి బయటకు వచ్చినతరువాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా చెడు వ్యసనాలు, జల్సాలు తీర్చుకోనుటకు మరల వారి పాత పద్ధతి మార్చుకొని కొత్తగా బైక్ ల దొంగతనాలు చేయాలని మహబూబాబాద్, ఖమ్మం, మరియు విజయవాడ జిల్లాలలో తిరుగుతూ వివిధ పోలిస్ స్టేషన్ పరిది లలో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు గవర్నమెంట్ హాస్పటల్ లో పెట్టిన బైక్ లను దొంగలించి నిందితుడు ఏ2 అమ్మేవాడు.

ఈక్రమంలో సోమవారం రాజీవ్ గాంధీ సెంటర్, మరిపెడ బంగ్లా వద్ద మరిపెడ పోలీస్ లు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్ పై వెళుతున్న ఏ1 నీ పట్టుకొని విచారించగా అతను నడుపుతున్న బైక్ మరిపెడలోని బస్టాండ్ వద్ద దొంగతనం చేసినానని

అలాగే వివిధ ప్రాంతాలలో దొంగలించిన బైక్ లను ఎడ్జెర్ల లో నివసిస్తున్న ఏ2. కాగితపు రాంబాబు కు . అమ్మినానని చెప్పిగా వెంటనే ఏ2. కాగితపు రాంబాబు ని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి మొత్తం ఆరు బైక్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

స్వాధీనపు వివరాలు:

1) ఏపీ 36 ఏడబ్ల్యు 3503 ఫ్యాషన్ ప్రో బ్లాక్ కలర్

2) ఏపీ 27 ఏ 4371 డిస్కవరీ 125 సిసి

3)ఏపీ 07 ఏయూ 5619 పల్సర్ బ్లాక్ కలర్

4) టీఎస్ 02 ఈజె 5843 గ్లామర్

5) ఏపీ 20 ఏడబ్ల్యు 0192 గ్లామర్

6). ఏపీ-36- ఏ హెచ్-9215 స్ప్లెండర్ ప్లస్

పై నేరస్తులపై సస్పెక్ట్ షీట్స్ మరియు నిదితుడుఏ1 పై పిడి యాక్ట్ పెట్టడంతోపాటు ఇటువంటి నేరస్థులపై నిఘ పెంచడం జరుగుతుంది.

కావున ప్రజలకు పోలిస్ వారి విజ్ఞప్తి ఏమనగా, తెలియని వ్యక్తులు మీ గ్రామాలలో తిరుగుతున్న, మీ చుట్టుప్రక్కల ఇళ్ళలోకి కొత్తగా కిరాయికి వచ్చే వ్యక్తుల పై అనుమానం ఉన్నా మరియు మీ ప్రాంతాలలో నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పద వాహనాలు

తిరుగుచున్నట్లితే వెంటనే 100 కి పోన్ చెయ్యండి.

ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న ఎల్. రాజు, సి ఐ మరిపెడ, ఎస్సై డి.పవన్ కుమార్ పిఎస్ మరిపెడ, పిసి.క్రాంతి కుమార్, పిఎస్ మరిపెడ సిబ్బందిని డి.ఎస్.పి. తొర్రూర్ అభినందించనైనది.