Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేరేడుచర్ల మున్సిపాలిటీ లో పిచ్చి కుక్కలు వీరంగం

మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు..

ప్రాణాలు పోతేనే పట్టించుకుంటున్న మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు..

నేరేడుచర్ల 11(నిజం చెపుతాం న్యూస్) :

నేరేడుచర్ల మున్సిపాలిటీ లో పిచ్చి కుక్కలు వీరంగం చేస్తున్నాయి.

గత పాలకవర్గ సమావేశంలో కుక్కలు పడుతున్నామని చెప్పారు.

కానీ కుక్కల నియంత్రణ చేయలేకపోయారు.

నేరేడుచర్ల మున్సిపాలిటీలో కుక్కలు కరుస్తున్నాయని చెప్తున్న  పాలకవర్గ సభ్యులు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు

పలువురు ప్రజలు సోషల్ మీడియాలో పదేపదే పోస్టు పెడుతున్న మున్సిపాలిటీ అధికారులకు చలనం లేదు

మున్సిపాలిటీలోని కుక్కల బెడదని వారించవలసిందిగా  మున్సిపల్ వార్డులో ప్రజలు అనేక రోజులుగా కోరుతున్నారు

చిన్నపిల్లల్ని స్కూలుకు పంపాలన్నా, పెద్దవారు మార్కెట్లకు రావాలన్నా కుక్కలు వెంబడించి కరుస్తున్నాయి

వీటిని నియంత్రణ చేస్తే మార్గం వెంటనే చేయాలని మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీని యూత్ సభ్యులు కోరుతున్నారు

గత ఐదు నెలల క్రితం నేషనల్ హైవే రోడ్డుపై సెంటర్ లైన్స్ స్తంభాలకు కరెంటు షాక్ వచ్చి ఒక వ్యక్తి మృతి చెందిన తర్వాత

మున్సిపల్ ఆఫీస్ వారు కరెంటు స్తంభాలకు వేసిన షో లైట్లు తీసేశారు

ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోతేనే లేకపోతే భారీగా ఏదైనా ప్రమాదం జరిగితేనో మున్సిపాలిటీ వారు స్పందిస్తారు.

“ప్రభుత్వ వైద్యాధికారి వివరణ ”

“ప్రభుత్వ వైద్యశాల అధికారి డాక్టర్ నాగిని

ఈరోజు ఎంతమందిని కుక్కలు కరిచాయి అని వివరణ అడగా ఎనిమిది నుంచి పదిమంది మహిళను కరిచాయి అని తెలిపారు.

ఇందులో ఒక మహిళకు తీవ్రంగా రక్తస్రావం జరగటం వల్ల ప్రభుత్వ వైద్యాధికారి హుజుర్నగర్ ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించారు..””

ఇకనైనా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ స్పందించి పలు వీధుల్లో తిరుగుతున్న కుక్కలు బెడద నివారించాలి అని మున్సిపాలిటీలోని ప్రజలు యూత్ సభ్యులు కోరుతున్నారు.