డోర్నకల్ కాంగ్రెస్ లో రచ్చ
కుదురుతే ఈ గట్టు..,లేదంటే ఆ గట్టు.
కాంగ్రెస్ మండల నాయకుల్లో కొత్తరాగం.
ఖద్దరు చొక్కాల కోసమే ఆరాటం
…చర్యలు లేక నాయకుల విచ్చవిడి.
కురవి,నిజంచెపుతాం,సెప్టెంబర్,09:
కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు మారడం లేదు.ఎవరికి వారే యమునా తీరే’లా మారింది.
మండల నాయకుల పరిస్థితి అలాగే ఉంది. రంగస్థలం సినిమాలో “ఆ గట్టు నుంటావా..,ఈ గట్టుకు వస్తావా” పాటవలె డోర్నకల్ హస్తంలో
ఖద్దర్చొక్కాల ఆరాటం కోసం సొంత గూటిలో ఉంటూ మండలానికి ఒక్కరిద్దరూ నాయకులు తమ స్వార్థాల కోసం “చొక్కాలు మార్చినట్లు”గా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త నాయకులను తెరపైకి తెచ్చి నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడంలో విఫమైందని చెప్పవచ్చు. డోర్నకల్ నియోజకవర్గంలో రోజు రోజుకు నాయకుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సొంత గూటిలో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి.
కాగా డోర్నకల్ నియోజకవర్గంలో ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ బలం పెంచుకుంది.
కాంగ్రెస్ పార్టీ 2019లో పుంజుకునే నేపథ్యంలో సొంత గూటిలో మండలానికి ఒక్కరిద్దరూ ఖద్దర్చొక్కాల కోసం “నాన్ లోకల్” నినాదాలతో లోకల్ నాయకుని తెరపైకి తెచ్చారు.
గ్రూపు రాజకీయల వల్ల గత ఎన్నికల్లో హస్తం ఛతికిలపడింది.ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది.
అందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాను శాశించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రామసహయం సురేందర్ రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చారు.
అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఖమ్మం పక్కనే ఉన్నదున వీరిద్దరి ప్రభావం బీఆర్ఎస్ పై పడే పరిస్థితి నెలకొంది.
కుదురుతే ఈ గట్టు.., లేదంటే ఆ గట్టు :
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే సమయంలో గత ఎన్నికల నుంచి రామచంద్రునాయక్,నెహ్రు నాయక్ మధ్య సతమతమవుతున్న క్రమంలో “ఉరిమి ఉరిమి మంగలం మీద” పడ్డట్లుగా మరొక నాయుడు పుట్టుకోచ్చారు.రంగస్థలం సినిమాలో “ఆ గట్టు నుంటావా..,ఈ గట్టుకు వస్తావా” పాటవలె డోర్నకల్ హస్తంలో ఖద్దర్చొక్కాల ఆరాటం కోసం సొంత గూటిలో మండలానికి ఒక్కరిద్దరూ తమ స్వార్థాల కోసం “చొక్కాలు మార్చినట్లు”గా నాయకులను మారుస్తున్నారు.
దీంతో నియోజకవర్గ స్థాయిలో నాయకుల మధ్య టికెట్ కోసం “నువ్వానేనా” అంటూ గ్రూపు రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
మండల నాయకుల్లో కొత్త రాగం..,
తెలంగాణ ఆవిర్భావంతో 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గుర్తింపు తెచ్చుకున్న రామచంద్రునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన నేతృత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసి మండల కమిటీలను ఏర్పాటు చేశారు.
అధికార పార్టీ అంతగా పుంజుకోక పోగా నేతల మధ్య వర్గవిభేదాలు ఉన్నాయి.ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రామచంద్రునాయక్ వైపు ప్రజల సానుభూతి ఉంది.2019 ఎన్నికల సమయంలో సొంత గూటికి చెందిన కొంతమంది మండల నాయకులు రామచంద్రునాయక్ పై విబేధాలతో “నాన్ లోకల్” వద్దు”లోకల్” ముద్దు అనే నినాదాలతో కురవి మండలానికి చెందిన నెహ్రు నాయక్ ని తెరపైకి తెచ్చారు.
దీంతో నువ్వానేనా అంటూ ఇద్దరి మధ్య వర్గపోరుతో కాంగ్రెస్ పరాజయం పొందింది. కాగా ఎంపిటిసి,సర్పంచి ఎన్నికల్లో నెహ్రు నాయక్ వెంట నిన్నటిదాక ఉన్న కొంతమంది మండల నాయకులు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త రాగం మొదలు పెట్టారు.
ఆ ఇద్దరు వద్దు “నాన్ లోకల్” ఐనా కొత్త నాయకుడే ముద్దు అంటూ భూపాల్ నాయక్ ని తెరపైకి తెచ్చారు.దీంతో డోర్నకల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టికెట్ కోసం ముగ్గురు మధ్య కుమ్ములాట నెలకొంది.
పార్టీ కార్యకర్తల్లో గుసగుసలు..,
రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకతతో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాల్సిన మండల నాయకులు తీరా ఎన్నికల సమయంలో కొత్త వారిని తెరపై పరిచయం చేయడంలో ఆంతర్యం ఏమిటి అని పార్టీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019లో నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటూ తెరమీదకు తీసుకొచ్చిన నాయకులు తీరా ఎన్నికల ముందు కొత్త రాగంతో నాన్ లోకల్ బెటర్ అంటున్న నాయకులు అసలు ఆ గట్టు నుంటారా..? ఈ గట్టు నుంటారా..? అనే ప్రశ్నలు ప్రజల్ని మరోమారు ఆలోచింపజేస్తున్నాయి.
అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఐక్యం చేయకుంటే హస్తం సత్కులపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.