హుజూర్ నగర్ లో ముత్యాలమ్మ జాతర షురూ….
-తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద జాతరగా హుజూర్నగర్ లో జరిగే ముత్యాలమ్మ జాతరకు పేరుంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించనున్న ముత్యాలమ్మ జాతరలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3 రోజుల పాటు ప్రభబండ్లు కట్టి సాంప్రదాయపద్ధతిలో మొక్కులు, మహిళలు బోనాలు చెల్లించుకుంటారు. నేడు ఆదివారం పెద్ద ముత్యాలమ్మ, రేపు సోమవారం చిన్న ముత్యాలమ్మ తల్లికి, 14న గురువారం కనకదుర్గమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు. జాతర సందర్భంగా దేవాలయాలకు వచ్చే భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జాతరలో భక్తులు అమ్మవార్లకు కోళ్లు, మేకలను బలివ్వడం, వ మహిళలు, యువతులు సాంప్రదాయ పద్దతిలో బోనాలు చెల్లింపులు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై రంగురంగుల ప్రభలను విద్యుతీపాలతో అలంకరించి డీజే చప్పుల్ల నృత్యాలతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద జాతరగా హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి 3 లక్షలకు పైగా భక్తులు వస్తారు.. ముత్యాలమ్మ జాతరకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది.. ప్రతి సంవత్సరం ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు..