Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

– కలెక్టర్ విజయ రామరాజు

– కడప సర్వ మతాలకు నిలయం
– ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
– పీస్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ రామరాజు
కడప నగరం కలెక్టరేట్ నందు ఏర్పాటుచేసిన అన్ని మతాల హిందూ, ముస్లిం, క్రైస్తవ పీస్ కమిటీ సభ్యుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, జాయింట్ కలెక్టర్, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
మొదట పీస్ కమిటీ సభ్యుల సలహాలు సూచనల తెలుసుకొని జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధన్ని ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని, రానున్న వినాయక చవితి పండుగలో మట్టి విగ్రహాలనే విక్రయించాలని, నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలవకుండా చూసుకోని, ప్రజలకు అభ్యంతరం కలవకుండా సౌండ్ సిస్టంను పెట్టుకోవాలని పీస్ కమిటీ సభ్యులను సూచించారు.
అదేవిధంగా నగరపాలక మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు తగు సూచనలను తెలియజేశారు. క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా, వినాయక చవితి అయినా తదితర పండుగలను వారి వారి సంప్రదాయాల ప్రకారంగా శాంతియుతంగా జరుపుకోవాలని మాట్లాడారు.
వినాయకుని విగ్రహం పెట్టేందుకు పర్మిషన్ విషయంలో ఒకచోటనే తీసుకునేందుకు కృషి చేయాలని కమిటి సభ్యులు కలెక్టర్ కు తెలియజేయగా అందుకు కలెక్టర్ స్పందించి అలాగే చేయాలని అధికారులకు చెప్పారు.
మట్టి విగ్రహాలు పెట్టుకున్న వారికి తక్కువ రుసుముతో పర్మిషన్ ఇస్తామని అన్నారు.
కడప నగరం సర్వ మతాలకు నిలయమని అన్నారు. పండుగ సమయంలో వినాయకుని నిమజ్జనంకు వెళ్లే మార్గంలో లిక్కర్ షాపులు తెలవకుండా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ సభ్యులు 48 డివిజన్ కృపా కాలనీకి చెందిన న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పి.మహేష్ అన్ని మతాల క్రైస్తవ, హిందూ, ముస్లిం గురువులు పీస్ కమిటీ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.