Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్యకు అసమ్మతి గుబులు..

● టికెట్ పక్కనా..?
● అధికార బీఆర్‌ఎస్ లో కొత్త ట్రెండ్‌
● అసంతృప్తి స్థాయి దాటిన అసమ్మతి
● ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణ
● పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని తీర్మానాలు
● ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరికలు
● తమ వర్గం నేతకే ఇవ్వాలని డిమాండ్‌
● బీసీ బంధులో అవినీతి అంటూ ఈమధ్య చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీ రమణారెడ్డి చేసిన ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్న అంతర్గతంగా అభిప్రాయభేదాలే అంటూ తెగ రహస్య ప్రచారం
● చివరకు తనకే బిఫామ్ అంటూ ఓవైపు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ప్రచారం
చేవెళ్ల, సెప్టెంబర్ 08 (నిజం న్యూస్) :
అధినాయకత్వం ఎవరికి టికెట్‌ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులందరూ పనిచేయడమే తెలిసిన బీఆర్‌ఎస్‌లో ఈసారి కొత్త ట్రెండ్‌ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి దాటి అసమ్మతి మరింత తీవ్రరూపం దాల్చింది.

మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దు.. ఇస్తే ఓడిస్తాం అంటూ సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇంతకాలం అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలు ఒక్కసారిగా బట్టబయలవుతున్నాయి.

ఇదే విధమైన అభిప్రాయభేదాలు చేవెళ్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యపై బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే యాదయ్య అవినీతికి పాల్పడ్డారని, నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల, సీనియర్‌ నాయకుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అసమ్మతి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఎమ్మెల్యే యాదయ్య తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఈసారి టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు.

రహస్య సమావేశాల్లో ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరోవైపు ప్రెస్‌మీట్లు పెట్టి మరి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పట్ల తమకున్న వ్యతిరేకతను బయటపెట్టారు. టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని కోరుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే యాదయ్యకు టిక్కెట్ ఇవ్వకూడదంటూ తీర్మానాలు చేస్తున్నారు. తాము సూచించిన నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నంకు టికెట్ ఇవ్వలాని కోరుతున్నారు.

రత్నంకు టిక్కెట్ ఇస్తే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ మాట కాదని ఎమ్మెల్యే యాదయ్యకు టికెట్ ఇస్తే ఓడించాలని తీర్మానించుకుంటున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. బీఆర్‌ఎస్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన పరిస్థితులను చూసి సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్య ఆందోళన చెందుతున్నరనడంలో సందేహం లేదు.

బీసీ బంధులో అవినీతి అంటూ అంటూ ఈమధ్య చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ రమణారెడ్డి చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే యాదయ్యపై అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలే అంటూ రహస్య ప్రచారాలు గుప్పుమంటున్నాయి.

మొత్తం మీద చేవెళ్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ గ్రూపులుగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ ఇస్తామని ప్రకటన చేసిన తరువాత కూడా టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఓ వైపు పరోక్షంగా తన అసంతృప్తిని బయట పెడుతూనే, బిఫామ్ ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు రావొచ్చన్న ఆలోచనలతో తన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

దానికి తోడు మార్పులకు అవకాశం ఉందంటూ ప్రచారం కూడా సాగుతుంది. మరోవైపు కెఎస్ రత్నం చివరగా టికెట్ నాకే వస్తుందని ధీమాతో చెప్పుకొస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గుబులు నెలకొంది.

అధిష్టానం పక్కగా తనకే టికెట్ ఇస్తుందా? ఎదైనా మార్పులు చేస్తుందా? అని లోలోపల ఆందోళన చెందుతున్నరనడంలో సందేహం లేదు.

చివరగా అందరు ఒక్కటయి ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అగ్రనేత సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యనే గెలిపిస్తారా ? లేక ఎవరి దారి వారు చూసుకుంటారా ? చూడాలి కాలం ఎలా సమాధానం చెబుతుందో..!