Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వైద్యులు..?

-ఇదేమిటని ప్రశ్నిస్తే వాదనకు దిగుతున్న డాక్టర్లు

రామన్నపేట ఇంచార్జి సెప్టెంబర్ 8 (నిజం చెపుతాం)
ప్రాణం బాగోలేదని రాత్రి వేళలో రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళితే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు మండలంలోని ప్రజలు రాత్రి వేళలో ప్రాణం బాగోలేదని ఆసుపత్రికి వెళ్తే ఉదయం పూట ఏం చేస్తారు

రాత్రి వేళలో ఆసుపత్రికి వచ్చి మాకు నిద్ర భంగం చేస్తున్నారని ఆసుపత్రికి వెళ్ళిన రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వైనం. మనిషికి జ్వరం అనేది చెప్పి రాదు ఏ సమయంలోనైనా ఏ వ్యక్తికైనా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్తే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

ఇదేమిటని ప్రశ్నిస్తే డాక్టర్లు వాదనకు దిగుతున్నారు. రోగి ఆసుపత్రికి వెళ్తే కనీసం నైతిక బాధ్యతగా చెయ్యి పట్టుకుని రోగి పరిస్థితిని పరీక్షించే తీరు లేకపోయే రోగులను అంటరాని వాళ్ళలాగా చూస్తూ దూరం నుండి రోగితో మాట్లాడి ఫార్మాలిటీగా ఒక ఇంజక్షన్ రాసి రోగులను మానసికంగా కృంగదీస్తున్నారు.

అయ్యా డాక్టర్లు. వైద్యులు అంటే నానుడి భాషలో వైద్యో నారాయణ అని అర్థం. అంటే ఒక రోగి మిమ్మల్ని ఒక దైవంల భావిస్తారు. అట్లాంటి మీరే మీ వృత్తి ధర్మాన్ని పాటించకపోవడం సిగ్గుచేటు.

మీరు ఏమైనా ప్రజలకు మీ ఇంటిలో నుండి మీ ఆస్తిలో నుండి సొమ్ము తెచ్చి పెట్టడం లేదు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము అంటే అర్థం ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా ప్రజల సొమ్ముతో అని గుర్తుపెట్టుకోవాలి.

మీరు రాత్రి వేళలో డ్యూటీ డాక్టర్ గా పనిచేసే మీరు ఏ సమయంలో రోగులు వచ్చినా మీరు మీ వైద్య సేవలు అందించాలి. కనీస బాధ్యత తెలవకపోవడం చాలా బాధాకరం ఎవరైనా ఒకరు ఇదేమిటని ప్రశ్నిస్తే రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కోరత ఉన్నదని ఎవరు రావడంలేదని సాకులు చెప్తున్నారు.

ఎవరు కొరకు వస్తున్నారు ప్రజల కొరకా మీ కొరకు కాదా మీ ఉద్యోగ బాధ్యత కొరకు కాదా లేనిపోని సాకులు చెప్పి ప్రజలను మభ్యపెడితే ఇది ఎంతవరకు కరెక్టు రాత్రి వేళలో డ్యూటీలో ఉన్న డాక్టర్ నిద్రపోవడమేమిటి రోగులు ఏ సమయంలో వస్తే మీకేంటి మీ డ్యూటీ మీరు చేస్తే సరిపోతుందిగా ఒక డాక్టర్స్ హోదాలో ఉండి రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని అనుకోవడం మీకు మీ పిచ్చితనం.

ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని రోగుల పట్ల ప్రేమాభిమానాలతో వైద్య సేవలు అందించాలని లేనియెడల పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని పలువురు ఆరోపిస్తున్నారు.