Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకట రామ నర్సమ్మ ఘనంగా సన్మానం

*దాయం రాజిరెడ్డి చారిటబుల్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి.

తుంగతుర్తి సెప్టెంబర్ 8 నిజం చెపుతాం న్యూస్

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, గౌరవ ప్రదమైనదని దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి అన్నారు.

ఇటివల వెలువడిన రాష్ట్ర స్పోర్ట్స్ పాఠశాల ఫలితాలలో వెంపటి ప్రాధమిక పాఠశాల నుండి 13 మంది ఎంపికైన సందర్భం తో పాటు పాఠశాల నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన

ప్రధానోపాధ్యాయులు వెంకట రామ నరసమ్మ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన మల్లేపాక రవీందర్ లను దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. కనిపించే దైవంగా ఎంతో మంది సామాన్యులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనన్నారు.నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు.

విలువలతో కూడిన విద్యనందించడంతో పాటు క్రీడల్లో తర్ఫీదు ఇచ్చి స్పోర్ట్స్ స్కూలుకు ఎంపిక కావడం లో కృషి అభినందనీయమన్నారు.

పిల్లల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని, వారిలో ఆ నమ్మకాన్ని కలిగించేలా ఉపాధ్యాయులు ,విద్యా వ్యవస్థ ముందుకు సాగేలా కృషి చేయాలని తెలిపారు.

అనంతరం విద్యార్థులకు శాలువాతో ఘనంగా సన్మానించి మేమొంటోలు అందజేశారు. నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లో పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులకే తిరిగి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.

గ్రామంలో సమిష్టి కృషితో ముందుకు వెళ్లినప్పుడే పాఠశాల విద్యార్థులు పాఠశాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం పలువురు వ్యక్తులు పాఠశాల అభివృద్ధిపై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బోయిని లింగయ్య, ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న, ఎస్ఎంసి చైర్మన్ పల్లూరు అంబేడ్కర్, జడ్పీహెచ్ఎస్ పిల్లల్లో ఉత్సవాలు ఉపాధ్యాయులు కూరపాటి రవీందర్, ఉపాధ్యాయులు మోతె శ్రీను,జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ బోనగిరి లక్ష్మీనారాయణ,

విశ్రాంత ఉపాధ్యాయులు సూదగని రాజయ్య, మాజీ సర్పంచ్ తునికి సాయిలు, పులుగుజ్జ యాకయ్య, అంజయ్య, యనగందుల మల్లేశ్,ఉపాధ్యాయబృందం భీవనపల్లి శ్రీనివాస్,పాలకుర్తి ఎల్లయ్య,

పాలకూరి జ్యోతి,మల్లెపాక రవీందర్, గుండ్ల ఆంజనేయులు,వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లూరి వెంకన్న, రమాదేవి మంజుల ,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు..