Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోజురోజుకు పెరుగుతున్న యూరియా కొరత

పది రోజుల నుంచి ఎదురుచూస్తున్న దొరకని యూరియా.

రైతన్నల ఆందోళన చెందుతున్నారు.

పెనపహాడ్ 8(నిజం చెపుతాం న్యూస్ ):

పెన పహాడ్ మండలంలో రోజురోజుకు పెరుగుతున్న

యూరియ కొరత మండలంలోని రైతుల ఆందోళన చెందుతున్నారు. పెనపహాడ్ మండలంలో రైతులు ఎక్కువగా పంటలు సాగు చేస్తారు

ఇక్కడ నేలల్లో పత్తి వరి ఎక్కువగా సాగవుతుంది పత్తి చేనుకు ఎకరాకు మూడు కట్టలు యూరియ అవసరం ఉండగా రైతుకు మూడు కట్టలే ఇస్తున్నారు

ఒక రైతుకు ఎడు ఎకరాల పొలం ఉంటే ఏడెకరాల పొలంలో పత్తి సాగు చేశాడు రైతుకు 20 కట్టలు యూరియ అవసరం ఉండగా మూడు కట్టలే ఇవ్వటం వల్ల రైతు ఆందోళన చెందుతూ

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి అదే రాష్ట్రంలో యూరియా కొరత రావటం వల్ల రైతుల ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు

పెనపహాడ్ మండలం మంత్రి జగదీశ్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని యూరియా కొరత రావడం వల్ల రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇకనైనా మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించి నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు చెబుతున్నారు

వ్యవసాయ అధికారులు అంచనాలు సరిగ్గా లేక కపోవడం వల్ల యూరియాను సరిగ్గా సప్లై చేయకపోవడం ద్వారా రైతుల ఇబ్బంది పడాల్సి వస్తుంది

అధికారులు డీలర్ షాపులకి ఎక్కువ యారియ ఇవ్వటం వల్ల వారు తగినంత రేటుకు అమ్ముకుంటున్నారు రైతులు వెళ్లి అడిగితే 300 నుంచి 350 కట్ట అని చెప్తున్నారు

వ్యవసాయ అధికారులు ఇకనైనా స్పందించి సహకార సంఘాలకు యూరియా సప్లై చేస్తే రైతులకు అందుబాటులో ఉంటుంది

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియకోరత లేకుండా చేయాలని రైతులు తెలిపారు