Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం నాణ్యమైన ఉచిత విద్య అందించాలి

బోనకల్ సెప్టెంబర్ 07 (నిజం చెబుతాం న్యూస్) : ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు ఆ దిశగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు.

ప్రతి బడ్జెట్లో వందల కోట్ల రూపాయలు గురుకులాల కోసం కేటాయిస్తున్న క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ నిధులు సరైన విధంగా అందటం లేదు.

బోనకల్ మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలు రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోని సమస్యలపై మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబుకు విన్నవించుకోగా గురువారం జడ్పిటిసి సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా పర్యవేక్షించటం జరిగినది.

పర్యవేక్షణలో జడ్పిటిసి దృష్టికి పలు రకాల సమస్యలు వచ్చినట్టు మీడియా మిత్రులకు తెలియజేశారు.

ప్రతి విద్యార్థికి తరగతిని బట్టి 30 రూపాయల నుండి 50 రూపాయలు ప్రతిరోజు ప్రభుత్వం కాంట్రాక్టర్ చెల్లిస్తున్నా కానీ ఆ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం లేదని, నీళ్ల చారు,కుళ్ళిపోయిన కోడి గుడ్లు, కుళ్లిపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం కొన్నిటికి తలుపులు కూడా లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారని,అన్నారు.

కనీస వసతులు కరువు.

గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా వారికి అరకొరగా మరుగుదొడ్లు ఉండటం, వాటికి సరిగ్గా డోర్లు కూడా లేకపోవడంతో, విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మధ్య మధ్యలో నీటి సమస్య కూడా తలెత్తడంతో, తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానం చేసిన వారికే నీళ్లు దొరుకుతారంతో త్వరగా లేచి క్యూలో నించొని మరి స్నానాలు చేసే దుస్థితి ఏర్పడింది.

కాంపౌండ్ వాల్ నిర్మించాలి.
ఈ గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పాఠశాలలో పునః ప్రారంభంలో కొత్తగా చేరిన విద్యార్థులు పలుసార్లు పారిపోవడం, కొంతమంది ఆకతాయిలు పాఠశాల వెనుక భాగము నుండి రాత్రిపూట రహస్యంగా చొరబడిన సంఘటనలు జరిగాయని తమ విద్యార్థులకు తమ పిల్లలకు భద్రత లేదని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.