Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలి

తుంగతుర్తి లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.

భువనగిరి పార్లమెంటరీ పరిశీలకులు, శ్రీనివాస్ మానే

తుంగతుర్తి సెప్టెంబర్ 6 నిజం చెపుతా న్యూస్

తెలంగాణలో రామన్నది కాంగ్రెస్ పార్టీ నేనని కార్యకర్తలు నాయకుల ఐకమత్యంతో పని చేస్తే గెలుపు గెలుపు ఖాయమని కర్ణాటక ఎమ్మెల్యే బోనగిరి పార్లమెంటరీ పరిశీలకులు శ్రీనివాస్ మానే అన్నారు.

బుధవారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి ప్రతి కార్యకర్త నాయకులు బూతులలో పని చేసినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని అన్నారు. తాను కర్ణాటకలో ప్రతి బూతులను పరిశీలించి ప్రతి 100 మందికి ఒక ఇన్ చార్జి చొప్పున ప్రవేశపెట్టి, పథకాల యొక్క ఆవశ్యకతను వివరించినట్లు తెలిపారు.

తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం 23 మంది నామినేషన్ వేశారని వారిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పనిచేసి తుంగతుర్తి సీటును కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిబద్ధత తో పని చేయాలని కోరారు. తెలంగాణలో బి ఆర్ఎస్ పార్టీ అవినీతితో కూరుకుపోయిందని అన్నారు.

ప్రజలు కేసీఆర్ చేసే వాగ్దానాలు నెరవేరక నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లాగా పనిచేసే రానున్న ఎన్నికల్లో సీటు పొందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
. కర్ణాటక రాష్ట్రంలో తాము ఒక్క రాక్షసుడుతోనే పోరాడమని అది బీజేపీ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంతో అధికార ధీమాతో ఎన్నో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాయని రుద్దుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, కార్యకర్తలు ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.

ప్రతి బూత్ లో 100 మంది ఓటర్లకొక కన్వీనర్ ను నియమించి నిత్యం పార్టీ ఆదేశాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో పరీక్షలు లాంటివని, గతంలో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్, అన్యపర్తి జ్ఞాన సుందర్ డాక్టర్, వడ్డేపల్లి రవి , గుడిపాటి నరసయ్య, బరపటి మహేశ్వర్ మాదిగ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు, రేతినేని శ్రీనివాస్, నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.