Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ADITYA L1: L1 పాయింట్ దగ్గర ఎందుకు పెట్టారో తెలుసా??

భారతదేశం ఇప్పటికే చంద్రయాన్ 3 వంటి మిషను విజయవంతంగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.. ఆ తర్వాత భారతదేశం యొక్క ఇస్రో ఆదిత్య L1 అనే మిషన్ను సూర్యుడు ని పరిశోధన చేయడానికి మిషను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు..

ఈ ఆదిత్య L1 అనే మిషన్ సూర్యుడి యొక్క సౌర తుఫాను అలాగే సూర్యుడి పరిసరాలు ఉండే వాతావరణ గురించి పరిశోధన చేయడానికి వెళ్లిన దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది..

ఆదిత్య l1 మిషన్ కు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా???

ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనా…

ఆదిత్య ఎల్ వన్ మిషన్ కు భారతదేశం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ను కేటాయించింది.. ఈ విషయాన్ని 400 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ ఆదిత్య ఎల్ వన్ స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేశారు.. ఇది ఇతర స్పేస్ ఏజెన్సీలతో పోల్చుకుంటే ఇస్రో కు కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువ నే చెప్పొచ్చు… ఈ మిషన్ కోసం చంద్రయాన్త్రీకి ఎంత కష్టపడ్డారో అలాగే శాస్త్రవేత్తలు ఈ మిషన్ విజయవంత కావడానికి కూడా అంతే కష్టపడ్డారు.. వారి కష్ట ఫలితమే ఆదిత్య మిషన్ విజయవంతం… భారతదేశం సూర్యుడిని పరిశోధన చేయడానికి భారతదేశం నుండి మొట్టమొదటి సూర్యుని పరిశోధన చేయడానికి వెళ్లిన మిషన్ ఆదిత్య ఎల్ వన్ మిషన్..

అసలు దీనిని ఎల్ వన్ పాయింట్ వద్ద ఎందుకు ఉంచారు??? 

ఈ స్ప్రేస్ట్ ఆఫ్ ను LARGRANCE POINT (L 1) అనే ఇమేజినల్ ఆర్బిట్ వద్ద దీనిని పెట్టనున్నారు.. అసలు దీనిని ఇక్కడే ఎందుకు పెడతారో తెలుసా??

ఈ మిషన్ చేపట్టడం వల్ల భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన చేయడానికి అలాగే అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి సూర్యుడు యొక్క పూర్తి వివరాల గురించి ఈ మిషన్ ఉపయోగపడుతుంది…

అలాగే ఈ మిషన్ లో ఆదిత్య ఎల్ వన్ లో 7 పేలోడ్స్ ఉంటాయి.. వీటిని సూర్యుడి గురించి పూర్తిగా పరిశోధిచడానికి అవసరపడతాయి…

ఈ పేలోడ్స్ చేసే పరిశోధనలు వీటి మీదే…

ఈ ఆదిత్య L 1 హలో ఉన్న పే లోడ్స్ సూర్యుడు యొక్క పొరలైన PHOTOSPHERE, CHRMOSPHERE,CORONA నా గురించి పరిశోధనలు చేస్తుంది..

పైన చూపించిన చిత్రంలో లాగా ఈ పేలోడ్స్ వాటి యొక్క ప్రవర్తన గురించి పూర్తిగా పరిశోధనలు చేస్తాయి.. అలాగే సూర్యుని పై ఉండే పొరల గురించి ఈ మిషన్ పరిశోధనలు చేస్తుంది…

క్రోమోస్పియర్ అంటే చంద్రుడు నుండి విడుదలయ్యే హైడ్రోజన్ వేడి అవుతుంది.. దీనిని గ్రహణాల సమయంలో మాత్రమే ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది.. ఆ సమయంలో మనం చూడడానికి కూడా వీలుగా ఉంటుంది…

అలాగే సూర్యుడిలోని క్రోమోస్ఫియర్ నుండి వేడి సూర్యుడు చివరి భాగమైన కరోనా పరలోకి ఎలా వస్తుంది అలాగే ఆ పొర నుండి ఈ కరోనా కొరకు వేడి ఎలా వస్తుంది అనే వాటి గురించి పరిశోధనలు చేస్తాయి.. సూర్యుడి యొక్క క్రోమోస్ఫియర్ నుండి కరోనా కొరకు వేడి పాస్ కావడానికి ఒక హైవేల ఉపయోగపడుతుంది.. కరోనా భాగం సూర్యుడి యొక్క చివరి భాగం.

ఆదిత్య L 1 చేయబోయే పరిశోధనలు….

సూర్యుడు యొక్క ముఖ్యమైన మూడు భాగాలను పరిశోధనలు చేస్తుంది… సూర్యుడు నుండి కరోనా లేయర్ భాగానికి ఎక్కువ వేడి ఎందుకు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుందో… అక్కడ జరిగే రసాయనాల మార్పుల గురించి పరిశోధనలు చేస్తుంది..

అలాగే సూర్యుడిపై జరిగే మాస్ అజక్షన్ అన్ ఫెయిర్ అండ్ ఫెయిర్ యాక్టివిటీస్ ని పూర్తిగా పరిశోధనలు చేస్తుంది..

సూర్యుడు చుట్టూ ఉండే అంతరిక్ష వాతావరణం, డైనమిక్స్, స్పేస్ పార్టికల్స్ ఫీల్డ్ యొక్క ప్రాపగేషన్లను స్టడీ చేస్తుంది..

అసలు సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు చాలా ఇంత వేడిని ఉత్పత్తి చేస్తున్నాడు అలాగే దేనితో తయారయింది అసలు దేనితో సూర్యుడు పనిచేస్తాడు, అంతరిక్షంలో సూర్యుడి ప్రవర్తన ఎలా అనే విషయాల గురించి ఈ ఆదిత్య ఎల్ వన్ మిషన్ పూర్తిగా పరిశోధన చేస్తుంది..

L1 పాయింట్ వద్దనే ఎందుకు పెట్టారో తెలుసా???

సౌర కుటుంబాలు ఉన్న ప్రతి గ్రహం వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి.. అంతరిక్షం నుండి వచ్చే తుఫానుల గురించి పరిశోధనలు చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే ఎలా తప్పించుకోవాలో అనే దాని గురించి పరిశోధన చేస్తుంది ఈ పాయింట్ వద్ద నుండి…

ఈ మిషన్ సూర్యుడి దగ్గరకు వెళ్తుందా???

ఈ పైన చూపించిన చిత్రంలో లాగా ఆదిత్య L1 మిషన్ ఎల్ వన్ పాయింట్ లో ఎలా ఉంటుందో చూడవచ్చు..

అంతరిక్షంలో సూర్యుడి నుండి భూమికి చాలా దూరం ఉంటుంది.. సూర్యుడు నుండి భూమికి 150. 98 మిలియన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది.. అలాగే ఆదిత్య మిషన్ భూమికి దగ్గర్లో ఉన్న L 1 అనే పాయింట్ వద్ద అక్కడే ఆగిపోయి ఇమేజినరీ ఆర్బిట్ వద్ద తిరుగుతూ ఉంటుంది..

దీనిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు మార్చుతూ గమనిస్తూనే ఉంటారు.. అసలు ఎల్ వన్ పాయింట్ అంటే ఒక రెండు అంతరిక్ష వస్తువుల మధ్యన ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ గా పిలుస్తూ ఉంటారు.. ఈ ఎల్ వన్ పాయింట్ వద్ద సమానమైన గ్రావిటేషనల్ శక్తి ఉంటుంది…

ఏదైనా వస్తువు అక్కడ పెడితే అది అక్కడే ఉండిపోతుంది… ఈ పాయింట్ వద్ద పెట్టడం వలన భూమి తిరుగుతున్న సమయంలో ఎక్కువ రొటేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే సూర్యుడిని దగ్గరగా పరిశోధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..

ఇక్కడ L1,L2,L3,L4,L5 అనే పాయింట్ లో ఉంటాయి.. వీటిలలో L1 పాయింట్ చాలా ప్రత్యేకమైనది.. ఇక్కడ సూర్యుడు నుండి భూమికి మధ్యలో సమానమైన ఆకర్షణ శక్తి ఉంటుంది…

మిగిలిన మిగతా పాయింట్లు వద్ద ఎక్కువగా భూమి యొక్క ఆర్బిటాల్ శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ తో పెట్టడానికి వీలుకాకపోవడం..

L1 పాయింట్ అనే దాని వద్ద సమానమైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండటంతో సూర్యుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలు చేయడానికి ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది..

అలాగే ఆదిత్యాల్వార్ మిషన్ L1 పాయింట్ చేరుకోవడానికి 128 రోజులు సమయం పడుతుంది.. ఇది కూడా చంద్రయాన్ త్రీ లాగానే భూమి చుట్టూ తిరుగుతూ తన వేగాన్ని పెంచుకొని నిర్దేశించిన కక్షలోకి వెళుతుంది…