ఆదివాసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో ఎ.ఆర్-ఎస్.ఐ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సన్మాన కార్యక్రమం

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రము లో ఆదివాసీ సంఘాల (జే.ఏ.సీ) ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన ఎ.ఆర్-ఎస్.ఐ ఊకే.రామారావు మరియు రిటైర్డ్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాటి.వెంకటేశ్వర్లు కు ఆదివాసీ నాయకులు,శివాలయం ప్రాంగణంలోని సత్రం నందు ఆత్మీయంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆదివాసీ నేతలందరూ వ్యాఖ్యానిస్తూ ఆదివాసీలు ఉన్నత విద్యా, ఉద్యోగ, రాజకీయ, రంగాల్లో ముందు ఉండాలని, ఊకె.రామారావు ను ఆదర్శంగా తీసుకొని నిరుపేద కుటుంబంలో పుట్టిన కానీ కృషి,పట్టుదల తో మరలా మరలా ప్రయత్నించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని. అతను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని,ఆదివాసీల మనుగడకు కృషి చేయాలని కోరుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవీ విరమణ చేసిన తాటి. వెంకటేశ్వర్లు గారిని తమ యొక్క సలహాలు,సూచనలు అందిస్తూ ఆదివాసీ సంఘాల ను ముందుకు నడిపించాలని,ఆదివాసీలందరు ఐక్యంగా ఉండి హక్కులు, చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమం లో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి.శ్రీనివాసరావు, ఆదివాసీ జే.ఏ.సీ కన్వీనర్ వాసం.రామకృష్ణ,తుడుందెబ్బ ప్రచార కార్యదర్శి దారబోయిన.రమేష్,ఆదివాసీజే.ఏ.సీ- మండల అధ్యక్షుడు మడివి.నాగేంద్రబాబు,ఉపాధ్యక్షులు వాడే.రాంబాబు, ప్రధాన కార్యదర్శి తాటి.శ్రీను,తుడుందెబ్బ సినియర్ నాయకులు తాటి.వీరభద్రం, తొట్టి పంపు సర్పంచ్ సున్నం.చిరంజీవి,పెంట్లం ఉప సర్పంచ్ తాటి.రామచంద్రరావు,కట్టం.శివ,పద్దం.నాగేశ్వరావు, తాటి.సునీల్(కానిస్టేబుల్), ఎట్టి.పూర్ణ(కానిస్టేబుల్), తదితరులు పాల్గొన్నారు.