Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సంజూ శ్యామ్ సన్ కు మరోసారి మొండి చెయ్యి

ఇండియా వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.

15 మందితో కూడిన జట్టులో సందు శాంసన్ కు మొండి చేయి చూపించారు. అతనికి అడపాదడపా అవకాశాలు ఇచ్చిన తన టాలెంట్ ను నిరూపించుకునే పూర్తి అవకాశం రాలేదని చెప్పాలి. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో అతని పేరు లేకపోవడంతో స్యాంసన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా లను వైస్ కెప్టెన్ లు గా ఎంపిక చేసింది.  గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న రాహుల్ కు ప్రధాన కీపరుగా అవకాశం ఇచ్చింది. రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ ను మరో కీపర్ గా ఎంపిక చేసింది.

ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, పేస్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ, సంజు శ్యామ్ శ్యామ్ సన్ లకు మొండి చెయ్యి చూపించింది.

15 మందితో కూడిన జట్టు వివరాలు…

రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా రవీంద్ర జడేజా, అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్ బూమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్,

ఇషాన్ కిషన్, రాహుల్.

సెప్టెంబర్ 28 వరకు జట్టులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చని ఐసిసి వెల్లడించింది.