Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మకు దక్కని చోటు

ఇండియా వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.

ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా లను వైస్ కెప్టెన్ లు గా ఎంపిక చేసింది.  గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న రాహుల్ కు ప్రధాన కీపరుగా అవకాశం ఇచ్చింది. రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ ను మరో కీపర్ గా ఎంపిక చేసింది.

ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, పేస్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ, సంజు శ్యామ్ శ్యామ్ సన్ లకు మొండి చెయ్యి చూపించింది.

15 మందితో కూడిన జట్టు వివరాలు…

రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లు బ్యాటింగ్ భారం మోయనున్నారు.

హార్థిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర పటేల్ ఠాకూర్ లు ఆల్రౌండర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

బూమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవులు బౌలింగ్ భారాన్ని మోయన్నారు.

వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్ రాహుల్ కీపింగ్ భారాన్ని మోయనున్నారు.

సెప్టెంబర్ 28 వరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చని ఐసిసి వెల్లడించింది.