యాదాద్రిశుడి సేవలో హీరో విజయ్ దేవరకొండ
యాదగిరిగుట్ట:సెప్టెంబర్3(నిజం చెపుతాం) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరికి ఆలయఅధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం అద్దాల మండపంలోఅర్చకులు వేదాశీర్వచనం చేయగా,ఈఓగీతారెడ్డి స్వామివారి శేష వస్త్రం అభిషేకం లడ్డు ప్రసాదం అందజేశారు.
క్షేత్ర పరిశీలన చేసి సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి క్షేత్రాన్ని అత్యంతఅద్భుతంగా పునర్ నిర్మింప చేశారని కొనియాడారు.