Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

25వేలతో మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలి.

ఎన్ ఎస్ యు ఐ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు భానోతు రమేష్ నాయక్.

ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.

కురవి,నిజంచెపుతాం,సెప్టెంబర్,03:

25 వేలతో మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని కోరుతూ ఎన్ ఎస్ యు ఐ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో స్థానిక ఆలయ సెంటర్లో నిరసన దీక్ష శనివారం చేపట్టారు.

ఈ దీక్షా శిబిరానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు మల్ల చరణ్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు భానోతు రమేష్ నాయక్ మాట్లాడుతూ…మెగా డీఎస్సీలో ప్రమోషన్ల ఖాళీలను చూపించాలి.

ఆర్ట్స్ & క్రాఫ్ట్ ఖాళీలను వెంటనే ప్రకటించాలి.స్టూడెంట్ రేషియో కాకుండా సబ్జెక్టుల రేషియా ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలి.

‘ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటుకు ధీటుగా బలోపేతం చేయాలి.రాజీవ్ గాంధీ 14 వ, వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు చరణ్,ఎన్ఎస్ యూ ఐ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్,

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్,మండల ఉపాధ్యక్షులు బాలగాని శ్రీనివాస్,మాలోతు లింగ్య నాయక్,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు,చిన్నం గణేష్,యువజన నాయకులు కొర్ని అనిల్,తట్టుపల్లి గ్రామపాటి అధ్యక్షులు యాకన్న తదితరుల నాయకులు పాల్గొన్నారు.