స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలో వెంపటి. పాఠశాల విద్యార్థులు విజయకేతనం
తుంగతుర్తి మండలంలో ఉద్యమాలకు పురటి గడ్డ… వెంపటి
వెంపటి గ్రామంలో విద్యార్థులు చదువుతోపాటు, క్రీడలు మరో పక్క ఉన్నతమైన ఉద్యోగాలు…
అత్యధికంగా పోలీసు ఉద్యోగాలు వెంపటి గ్రామంలో…. ప్రజలు చైతన్యవంతులు.
జిల్లాలో స్పోర్ట్స్ స్కూలుకు ఎంపికైన 13 మంది విద్యార్థులు
తుంగతుర్తి సెప్టెంబర్ 3 నిజం చెపుతాం న్యూస్
తుంగతుర్తి మండలంలో నాడు… నేడు పోరాటాలకు పురటి గడ్డ వెంపటి గ్రామం. చిన్నతనం ఉండే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాష్ట్రస్థాయి లో రాణించి ఎంతోమంది క్రీడా స్ఫూర్తితో, క్రీడా కోట కింద ఎంతోమంది ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన గడ్డ వెంపటిగా చెప్పవచ్చు.
ఈ గ్రామంలో ప్రతి కుటుంబం లో విద్యావంతులుగా కావాలని తమ పిల్లలను కష్టపడి చదివించడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతున్నారు.
ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసే జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చారు.
దీనితో ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సూదగాని వెంకట రామ నరసమ్మ ప్రాథమిక పాఠశాల నుండి ఎన్నికగావడం గమనార్వం.
జిల్లా నుండి రాష్ట్రస్థాయిలో 46 మంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూలుకు పరీక్షల నిర్వహించగా కేవలం ఒక్క వెంపటి గ్రామం నుండి 13మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం సమాజం గర్వించదగ్గ విషయం.
ప్రతిభను పొందుతున్నారంటే కేవలం పాఠశాల ఉపాధ్యాయులే కాదు, గ్రామ సర్పంచ్, గ్రామంలోని పెద్దలు, దాతలు ఒక యూనిట్ గా ఏర్పడి సమిష్టి కృషితో, పాఠశాల అభివృద్ధిలో ప్రతి సంవత్సరం పాలుపంచుకోవడంతోనే అభివృద్ధిలో వెంపటి ప్రాథమిక పాఠశాల ముందడుగులు వేసింది.
స్పోర్ట్స్ స్కూలుకు ఎంపికైన విద్యార్థులు నాలుగవ, ఐదవ తరగతి విద్యార్థులైన దేశ బోయిన చైతన్య, పాకాల సాయి ప్రణవి, చిట్టి పాక వివేక్, యశ్వంత్, శివ, ప్రేమ్ కుమార్, రేష్మ, దివ్యశ్రీ ,యశ్వంత్ ,సోమేశ్ భరత్ అభినవ్ జతిన్ లు స్పోర్ట్స్ స్కూల్లో సెలక్షన్ కావడం గమనార్హం.
ఏది ఏమైనా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట రామ నరసమ్మ, పి ఈ టి పుల్లూరు వెంకన్న, ఆంజనేయులు, మల్లెపాక రవీందర్, శ్రీనివాస్ లయ, స్థానిక సర్పంచ్ అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్ సహకారంతో ప్రత్యేకంగా పాఠశాలలో శిక్షణ ఇవ్వడంతో నేడు స్పోర్ట్స్ స్కూలుకు సెలక్షన్ అయ్యారు.
దీనితో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా పాఠశాల 13మంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూలుకు సెలక్షన్ కావడం సంతోషంగా ఉంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట రామ నరసమ్మ వెంపటి
పాఠశాలలోని విద్యార్థులకు ఒక ప్రక్క చదువుతోపాటు మరొక ప్రక్క కీళ్లలో రాణించుటకు ప్రత్యేకతను ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం మండలం జిల్లాలతో పాటు నేడు స్పోర్ట్స్ స్కూల్ కూడా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా క్రీడల్లో రాణించడం వెంపటి పాఠశాల గుర్తింపు లభించింది అని అన్నారు.
రాజకీయాలకతీతంగా పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటాము.
అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్ వెంపటి సర్పంచ్
ప్రతి సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల పెంపుదల కోసం ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను పాఠశాల లో చేర్చుతాం నేడు పాఠశాల కార్పొరేట్కు దీటుగా సాగుతున్నది సుమారు 277 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
విద్యార్థుల ప్రయోజనాల దుష్ట మౌలిక వస్త్ర రూపకల్పన కోసం ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అడగగానే నిధులు మంజూరు చేశారు. దీనితో పాఠశాలలో కొన్ని సమస్యలు తీరాయి.
పాఠశాల అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరం విధిగా పాలుపంచుకుంటాము నేడు జిల్లాలో 46 మంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కాదా అందులో మా13విద్యార్థులు ఉండడం చాలా సంతోషంగా ఉంది.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతారని తెలిపారు