Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వెంకట రామ నరసమ్మ ఎంపిక పట్ల హర్షం

– 2003లోనే మండల ఉత్తమ ఉపాధ్యాయురాలు, – 2013లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు ఎంపిక.

– 2023 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా

తుంగతుర్తి సెప్టెంబర్ 2 నిజం చెపుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన వెంకట రామ నరసమ్మ చిన్నతనం నుండి విద్యలో రాణించి ఉన్నతమైన విద్యను అభ్యసించారు.

ఇంటర్ పూర్తి అయిన అనంతరం 1984 85 లో టిటిసి లో ప్రత్యేకంగా శిక్షణ పొంది, అనంతరం టీచర్ ఉద్యోగం 1986 జూన్ 16 సంపాదించారు మొట్టమొదటి తుంగతుర్తి మండలం లోని మానాపురంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు.

2011 నుండి 2023 వరకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా రాణించి, గడిచిన 37 సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థులను, ఉద్యోగులుగా తీర్చిదించిన ఘనత ఆమెకే దక్కింది.

2023 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేయడంతో తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు మేధావులు శ్రేయోభిలాషులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

వెంపటి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం 277 మంది విద్యార్థులతో ఆరుగురు టీచర్లతో, కార్పొరేట్ దీటుగా, సాగుతున్నది.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలుపుతూ, ఈ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు , జిల్లా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.