గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ దుర్గ భవాని …సస్పెండ్
సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 2 నిజం చెపుతాం న్యూస్
తుంగతుర్తి గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ దుర్గాభవాని గతంలో చోటు చేసుకున్న పలు సంఘటనపై రాష్ట్ర ఉన్నత అధికారులు, పూర్తిస్థాయిలో విచారణ
జరిపి పాఠశాలలోని విద్యార్థులకు మంచినీటి వసతులు కల్పించడంలోనూ, గతంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి ప్రస్తుతం సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏది ఏమైనా గతంలో జరిగినటువంటి సంఘటనపై మీడియా మిత్రులు విద్యార్థులకు న్యాయం చేయాలని పత్రికల్లో రాయగా, ప్రముఖ పత్రిక విలేకరులను దూషించడం కూడా జరిగింది.
ఎట్టకేలకు రాష్ట్ర గిరిజన సొసైటీ ఉన్నతాధికారులు, పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం.