ఎమ్మెల్యే కిషోర్ పై తప్పుడు ప్రకటనలు చేస్తే… ఖబర్దార్
బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య హెచ్చరిక
బిజెపి కాంగ్రెస్ నాయకుల మాయమాటలు ప్రజలు నమ్మరు
తుంగతుర్తి మెయిన్ రోడ్డు పై భారీ ర్యాలీ నిర్వహించిన బి ఆర్ఎస్ నాయకులు
తుంగతుర్తి సెప్టెంబర్ 1 నిజం చెపుతాం న్యూస్
నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కిషోర్ పై బిజెపి నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తే.. ఖబర్దార్ అని తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య హెచ్చరించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాదరి కిషోర్ కుమార్ ప్రకటించినందుకుగాను ఒక్కొక్క గ్రామపంచాయతీకి పది లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షిస్తూ బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం 5400 కోట్లకు పైగా హెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందని అన్నారు.
దవాఖాన కోసం 40 కోట్ల నిధులు మంజూరు చేయించారని రామన్న రోజుల్లో నూతన బిల్డింగ్ తో సహా, 100 పడకల దవాఖానగా మారనున్నట్లు తెలిపారు.
తిరుమలగిరి పైలెట్ ప్రాజెక్టుతో పాటు తుంగతుర్తిలో అత్యధికంగా దళిత బంధు నిధులు మంజూరు చేయించడంతో నాడు కూలీలు నేడు ఓనర్లుగా మారి ఎన్నో కుటుంబాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్టు తెలిపారు. కుట్రలు కుతంత్రాలు రానున్న అసెంబ్లీ ఎన్నికలు మూడోసారి హ్యాట్రిక్ విజయం గాదరి కిషోర్ దేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, గుండె గాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి కటక వెంకటేశ్వర్లు గోపగాని రమేష్ గౌడ్
గోపగాని శ్రీను పులుసు వెంకటనారాయణ గౌడ్ ముత్యాల వెంకన్న ఎల్లబోయిన బిక్షం గాజుల యాదగిరి ఆకారపు సైదులు మల్లెపాక వెంకన్న చెరుకు పరమేష్ తడకమల రవికుమార్, కిరణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు…