Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా…. బరపటి మహేశ్వర్

ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీలో రాణించి గ్రేడింగ్ 1,ఉద్యోగం లో రిటైర్డ్ ఉద్యోగి…

నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ….పోటీలో

తుంగతుర్తి ఆగస్టు 31 నిజం చెపుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన దళిత బిడ్డ బరపటి మహేశ్వర్ చిన్నతనం నుండి విద్యలో రాణించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీలో రానించి, గ్రేడ్ వన్ ఉద్యోగంలో రాణించి ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ అయ్యాడు.

చిన్నతనం నుండి గ్రామంలో ప్రజలకు సేవ తలంచి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 2022 23 సంవత్సరం గాను అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుండగా గాంధీభవన్లో దరఖాస్తు పొంది తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు.

దళిత బిడ్డ నైనా నాకు టికెట్ రావాలని, పేద ప్రజలకు సేవ చేయాలని నా లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉద్యమకారులు ఆశీర్వదించాలని కోరారు.

గ్రామంతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన తోటి ఉద్యోగులతో కలిసి ఉద్యమం చేసినట్టు తెలిపారు…