Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు…

వలిగొండ 31 (నిజం చెపుతాం)
మండల పరిధిలోని గోకారం గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు మహిళ తన ఇద్దరు పిల్లలతో మరియు తన తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలుపుతున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని జాలుకాలువ గ్రామానికి చెందిన పల్లపు భాగ్యలక్ష్మి కి 2014 సంవత్సరంలో ఆలేరు పట్టణానికి చెందిన వల్లేపు రమేష్ తో వివాహం జరిగింది వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కాగా గోకారం గ్రామానికి చెందిన దేశపాక పరమేష్ తన అత్తవారింటికి వచ్చి ఇద్దరు పిల్లలు తనకే జన్మించారని 2017 సంవత్సరంలో నానా రభస చేయడంతో అత్తింటి వారు తనను పంపివేశారని ఆమె వాపోయారు.

తన బ్రతుకుతెరువు కోసం చౌటుప్పల్లో జీవనం సాగిస్తుండగా అక్కడ కూడా పరమేష్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని తనను తనవారికి కాకుండా చేసి నేడు తప్పుకు తిరుగుతున్నాడని పెద్ద మనుషులు న్యాయం చేస్తామని చెప్పి తనకు అన్యాయమే చేశారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

తనకు తన పిల్లలకు మరణమే శరణమని దేశపాక పరమేష్ తనను వివాహం చేసుకోవాలని లేనిపక్షంలో తను మరణించే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆమె అన్నారు.