Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తుంది.. సీఎం కేసీఆర్

కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీల పండుగ తెలియజేస్తుందని సీఎం తెలిపారు.

భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం తెలిపారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని అన్నారు.

అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెల్లు ఆకాంక్షిస్తారని సీఎం తెలిపారు.

మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు.

మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసానందిస్తున్నాయన్నారు.

సంపదను సృష్టించి సకల జనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సీఎం అన్నారు.

అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని సీఎం అన్నారు.

ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు.

రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.