Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ధూప, దీప, నైవేద్యం పథకం అలవెన్స్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ

– సీఎం కేసీఆర్‌తోనే అర్చకులకు గుర్తింపు : మంత్రి జగదీష్ రెడ్డి

– ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 793 ,రాష్ట్ర వ్యాప్తంగా 6,541 దేవాల‌యాల‌కు చేకూరనున్న ప్రయోజనం

– సంతోషం వ్యక్తం చేస్తున్న అర్చకులు

– మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన అర్చకులు

*హైదరాబాద్*

ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అర్చకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అర్చకులను గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి గారిదే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారన్నారు.

ఆలయాలను అభివృద్ధి చేయడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న మంత్రి, రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అర్చకులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.

గతంలో ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకంలో అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్చకుల ఆశీర్వచనాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాక్షించారు..సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్‌ పని చేస్తున్నదన్నారు.

గడిచిన జూన్‌ నెలలో రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ అర్చకులపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప, నైవేద్యం అలవెన్స్‌ను రూ.10వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోనిఆలయాలకు ప్రయోజనం కలుగనున్నది. దీంతో అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం జీవో జారీ చేసినందుకు సీయం కేసీఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అర్చకులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

డా..బీ.ఆర్ అంబెధ్కర్ సచివాలయం లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన అర్చకులు మంత్రి జగదీష్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

వేతనం పెంపును సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమ‌న్నారు. వేతన పెంపు తో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 793 ,రాష్ట్ర వ్యాప్తంగా 6,541 దేవాల‌యాల‌కు ప్రయోజనం చేకూరనున్నది.