Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్యాంకులో సబ్సిడీలు రుణాలు ఇప్పిస్తానని మోసం

వేములవాడ, ఆగస్టు 30 నిజం చెపుతాం;

రాజన్న సిరిసిల్ల వేములవాడ.

బ్యాంక్ లో సబ్సిడీ రుణాలు ఇప్పిస్తా అని అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసున్న వ్యక్తి అరెస్ట్.

54,000-/రూపాయలు, ఒక మొబైల్ ఫోన్, స్కూటీ స్వాధీనం.రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో అమాయక ప్రజలను బ్యాంక్ లో వివిధ రుణాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి

బుధవారం రోజున వేములవాడ పట్టణ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

నిందుతుని వివరాలు.అల్లాడి మోహన్ తండ్రి వెంకన్న వయస్సు 60 సంవత్సరాలు, ఆర్/ఓ శివ నగర్ వరంగల్

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ:

అల్లాడి మోహన్ అనే వ్యక్తి సమాజంలో పెద్దమనిషిలా చలామణి అవుతూ అమాయక ప్రజలకు అవసర నిమిత్తం వారి వారి బ్యాంకుల వద్ద నుండి వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తానని వారిని నమ్మించి,వారి వద్ద కొంత మొత్తంలో డబ్బులు తీసుకొని వారిని మోసం చేయాలనే ఉద్దేశంతో వారికి లోన్స్ ఇప్పించకుండ మోసం చేసేవాడు.

ఈ క్రమంలో వివిధ చోట్ల తిరుగుతూ ప్రజలను నమ్మించి మోసం చేసే క్రమంలో వేములవాడ పట్టణంలో తహశీల్దార్ ఆఫీస్ ముందు టి స్టాల్ నడుపుకుంటున్న ఆవునూరి సాగర్ తండ్రి దేవయ్య అనే వ్యక్తిని నమ్మించి, సాగర్ కి ప్రైమ్ మినిస్టర్ జనరేషన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం క్రింద 5,00,000,రూపాయలు సబ్సిడీ కింద ఇప్పిస్తానని నమ్మించి అతని వద్ద నుండి తేదీ 20-04-2023 రోజున 70,000,రూపాయలు తీసుకొని అక్కడి నుండి వెళ్లి పోయి అతనికి ఎలాంటి డబ్బులు ఇప్పించక పొగ సాగర్ ఫోన్ చూసినప్పుడల్లా ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ పెట్టేవాడు.

ఇదే విధంగా మోహన్ అనే నిందుతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలకు చెందిన పలువురు వద్ద కోడిముంజ హరికృష్ణ దగ్గర 1,00,000/-రూపాయలు, అదెపు వెంకటేష్ అనే వ్యక్తి వద్ద 65,000/- రూపాయలు, ఎస్.కె హమ్మద్ అనే వ్యక్తి వద్ద 21,000/- రూపాయలు,అన్నడి కిరణ్ వద్ద 1,00,000/- రూపాయలు, ఎండి చంద్ పాషా వద్ద 50,000/- రూపాయలు,బోయిని బాబు వద్ద 40,000/- రూపాయలు, మ్యాల్ల సురేష్ వద్ద 40,000/-రూపాయలు,ఉతాం గంగాధర్ వద్ద నుండి 25,000/- రూపాయలు, నక్క లక్మి వద్ద నుండి 10,000/-రూపాయలు, బిత్తపు కమల వద్ద నుండి 10,000/- రూపాయలు వీరితో పాటుగా మరికొంత మంది దగ్గర నుండి సబ్సిడి, లోనులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం జరిగిందని,

సాగర్ పిర్యాదు మేరకు ఈ రోజు మధ్యాన్నం సమయంలో తిప్పపూర్ బస్టాండ్ ప్రాంతంలో మోహన్ ను వేములవాడ టౌన్ పోలీస్ లు అరెస్ట్ చేసి విచారించగా అట్టి నెరాలన్ని ఒప్పుకోవడం జరిగింది.

మోహన్ దగ్గర 54,000/- రూపాయలు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్కూటీ స్వాధీనం చేసికొని రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి మోసపూరిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వ్యక్తులు సమాచారం తెలిస్తే సంబంధిత పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.