Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సెల్ ఫోన్ లో మెసేజ్… బ్యాంకుకు వెళ్తే నో రుణమాఫీ

బ్యాంకుల్లో ఆలస్యంగా వెలుగు చూస్తున్న రైతుల… గోస

సూర్యాపేట ప్రతినిధి, ఆగస్టు 30 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాల దృష్ట రైతు రుణమాఫీ పేరుతో 19 వేల కోట్ల పై చిలుకు రుణమాఫీ చేశారు.

దీనితో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఎస్బిఐ బ్యాంకు లో రైతు జటంగి నరసయ్య 2016,అకౌంట్ నెంబర్37168708509 లో 39,300 రూపాయలు రుణమాఫీ జరిగినట్టు అతని సెల్లులో మెసేజ్ వచ్చింది..

అమ్మయ్య… కేసీఆర్ సార్ వేసిన డబ్బులు వచ్చాయని మన కష్టాలు తీరాయని చాలా సంతోషపడ్డాడు. కానీ తీరా బ్యాంకుకు వెళ్లి చూస్తే, నీ డబ్బులు రిటన్ పోయినాయి.

నేనేమి చెయ్యాలయ్యా… అని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో కంగుతిన్నాడు. కొన్ని బ్యాంకుల్లో పడ్డ డబ్బులు అకౌంట్లో అదేవిధంగా ఉన్నప్పటికీ…. తుంగతుర్తి ఎస్బిఐ బ్రాంచ్ లో మాత్రం… ఈ విధంగా జరగడం ఏందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విధంగా కొంతమంది రైతులకు ఎస్బిఐ బ్రాంచ్ లో డబ్బులు తిరిగి పోయినట్లు స్థానిక మీడియాకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి బ్యాంకర్లకు, రైతుల డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలని పేద రైతులు కోరుతున్నారు.