Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఘనంగా క్రీడా దినోత్సవం

హుజూర్ నగర్ ఆగస్టు 29 (నిజం చెబుతాం న్యూస్)

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పరిధిలోని ఎం డి ఆర్ హై స్కూల్ నందు జాతీయ క్రీడా దినోత్సవ ఎంతో అట్టహాసంగా నిర్వహించారు.

హాకీ క్రీడా మాంత్రికుడైన ధ్యాన్చంద్ జన్మదినం పురస్కరించుకొని ఎం డి ఆర్ హై స్కూల్ నందు ఆటల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎం డి ఆర్ హై స్కూల్ కరస్పాండెంట్ మేరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు ఆటల్లోనూ నైపుణ్యతను ఇవ్వడంలో మా విద్యాసంస్థ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని ప్రతి విద్యార్థి ఆటల పైన సరైన దృష్టిని సాధించాలని పేర్కొన్నారు.

ఎండిఆర్ హై స్కూల్ ప్రిన్సిపల్ నలబోలు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం కచ్చితంగా మా విద్యాసంస్థలందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఉత్సవం ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శారీరక దృఢత్వంకలిగి ఉండాలి

ఇటువంటి కార్యక్రమంలో ముందు ముందు ఎన్నో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండిఆర్ హై స్కూల్ ఏవో పింగళి నర్సిరెడ్డి మరియు పిఈటిలు షేక్ మోయిన్ మరియు శీలం సైదులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.