మానవతా దృక్పథం లేదని నిరూపించుకున్న ప్రభుత్వ వైద్యాధికారి..?
– చిన్న పిల్లల్ని అని చూడకుండా బయటికి నెట్టేపించిన డాక్టర్
ఎస్సై పరమేష్ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి ఈ రాత్రికి ఈ చిన్న పిల్లల్ని ఈ మహిళలను ఇక్కడ ఉంచమని చెప్పినా వినని ప్రభుత్వ వైద్యాధికారిని
హాస్పటల్ సిబ్బందిని బెదిరించిన డాక్టర్
ప్రభుత్వ హాస్పిటల్ లో పేషంట్లను వెళ్లగొడుతున్న డాక్టర్
నేరేడుచర్ల ఆగష్టు 29(నిజం చెపుతాం న్యూస్ ):
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ హాస్పిటల్ సాయిబాబా రోడ్ లో షట్టర్ల ముందు నివసిస్తున్న ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్న పిల్లల్ని ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డుపై పడుకోబెడుతున్నారు
నేరేడుచర్ల ఎస్సై పరమేష్ ఈ రాత్రికి గవర్నమెంట్ హాస్పిటల్ లో పడుకోమని గవర్నమెంట్ హాస్పటల్ కు పంపించి, ఈరోజు నైట్ ఇక్కడ ఉంచమని డాక్టర్ గారితో చెప్పమని సిబ్బందికి తెలిపాడు.
హాస్పిటల్స్ సిబ్బంది ఉంచుకుంటామని చెప్పారు
హాస్పిటల్ లో వాళ్లు ఉండొద్దు చెప్పని ప్రభుత్వ వైద్యాధికారి ఈ హాస్పటల్ నాది నా ఇష్టరాజ్యమని మీరు చెప్తే ఎలా ఉంచుకుంటామని అక్కడికి చేర్పించిన అనాధ చిన్న పిల్లల్ని ఇద్దరి మహిళలను నిర్దాక్షిణ్యంగా గేటు బయటికి హాస్పటల్ సిబ్బంది, నైట్ వాచ్ మెన్ తో వాళ్ళని బయటకు పంపించింది
పసి పిల్లలు అని కూడా చూడకుండా బయటకు పంపిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.