కరోనా తర్వాత యువతలో పెరిగిన ఆకస్మిక మరణాలు
ప్రపంచాన్ని రెండేళ్ళపాటు పట్టి కుదిపేసిన కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి.
ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉందని, రమారమి ఏడు శాతం రోగులు కొవిడ్ చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడాదిలోను మృత్యువాతపడినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది.
తాజా గణాంకాల ప్రకారం 18-45 మధ్య వయస్సు గలవారిలో 14,419 మంది మరణించినట్లు తేలింది . కాగా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో చనిపోయే అవకాశం 1.7 శాతం రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.
గుండె సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు కొవిడ్ తర్వాత మరణాలకు ప్రదాన కారణంగా ఈ అధ్యయనం పేర్కొంది.
ఈ ఆకస్మిక మరణాల అంతు తేల్చడం కోసం న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఐసీఎమ్మార్ ఇప్పటివరకు 50 శవపరీక్షల నివేదికలను పరిశీలించింది.
రాబోయే కొద్ది నెలల్లో మరో 50 శవ పరీక్షల నివేదికల పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.
కరోనా సమయంలో వైద్య నిపుణులు త్వరితగతిన వ్యాక్సిన్స్ అందుబాటులోకి తేవడంతో.. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.
అయితే కరోనా అనంతరం యువతలో గుండెపోటు మరణాలు పెరిగాయి. ఎటువంటి వార్నింగ్ లేకుండానే ముహ్యంగా యువతలో కార్డియాక్ అరెస్ట్ వలన మరణాలు సంభవిస్తున్నాయి.
ఎందుకంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేసేవాళ్లు, డైట్ ఫాలో అయ్యేవాళ్లు సైతం హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, కార్టియాక్ అరెస్ట్‌ల కారణంగా మరణిస్తున్నారు.
దేశంలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టీనేజర్స్, యువత ఎక్కువగా ఇలా చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
అందుకే ఈ అంశంపై ఐ సి ఎం ఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఇటువంటి మరణాలను నివారించేందుకు కృషి చేస్తోంది.
(కధనం: ప్రతాప్ )