బీఆర్ఎస్ అభ్యర్థిగా కోదాడ బరిలో గుజ్జ యుగంధర్ రావ్….?
వర్గపోరుతో వివాదరహితుడిగా పేరొందిన యుగంధర్ వైపే అధిష్టానం చూపు..?
త్వరలో నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేసేందుకు సమాయత్తం….
ఎమ్మెల్యే మల్లయ్య కు టికెట్ ఇస్తే తాము పార్టీలో ఉండమని తెగేసి చెబుతున్న పార్టీ సీనియర్లు….
సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 29 నిజం చెపుతాం న్యూస్
కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరుకు త్వరలోనే అధిష్టానం చెక్ పెట్టనుందా…. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఉద్యమ నేత కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తుంది…
తమకంటే టికెట్ తమకేనని గత కొంతకాలంగా ఎవరికి వారు ప్రచారం చేసుకొని ఇటీవల మరో రాగం వినిపిస్తున్నట్టు సమాచారం…. కోదాడ ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ నుండి మల్లయ్య యాదవ్ కి ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలిపేదే లేదని వేరే గూటికి వెళ్లక తప్పదని బహిరంగంగానే చెబుతున్నారు.
తమకు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా ఏం లేదు కానీ మల్లయ్య యాదవ్ కు మాత్రం టికెట్ ఇవ్వవద్దని వర్గపోరు నేతలు ఖరాకండిగా అధిష్టానానికి తెలియజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి… ప్రత్యామ్నాయంగా పార్టీని గెలిపించుకోవాలంటే జిల్లా జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న గుజ్జ దీపిక భర్త యుగంధర్ రావు టికెట్ ఇస్తే తాము కష్టపడి గెలిపించుకుంటామని సంకేతాలు పంపినట్టు తెలుస్తుంది…
దీంతో అధిష్టానం అటుగానే అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం… రెండు దఫాలుగా బిఆర్ఎస్ అధికారం లో ఉండటం స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పై అధికార పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తుండడంతో చేసేది ఏమీ లేక వివాదరహితుడుగా, ఆర్థిక అంగ, జన బలాలు ఉన్న యుగంధర్ రావు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాడంతో అధిష్టానం అటుగా ఆలోచన మొదలుపెట్టినట్టు తెలుస్తుంది…
మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ కన్మoతరెడ్డి శశిధర్ రెడ్డి తో పాటు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, మోతె మండల జడ్పిటిసి, ఎంపీపీ, పలువురు సర్పంచులు, మిగతా మండలాల మండల స్థాయి నుండి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కొందరు ప్రస్తుత ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పై వ్యతిరేకంగా ఉన్నారు…
దీనికి తోడు గతంలో బీసీ కార్డుపై గెలిచిన మల్లయ్య గెలిచిన తర్వాత కొందరు ఉన్నత వర్గాలకు పదవులు ఇవ్వడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా వ్యతిరేకంగా ఉండడం, గతంలో అసెంబ్లీ ఎన్నిక సమయంలో మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చందర్ రాజ్ వు తో కలిసి గెలుపు గుర్రాన్ని ఎక్కిన తర్వాత గెలిపించిన వారందరిని పక్కకు పెట్టడం తో మల్లయ్య యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది…
దీనికి తోడు తమకు టికెట్ కావాలని మొదట్లో వాదించిన చందర్ రావు, కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి సైతం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడo, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి బరిలో ఉండడంతో స్థానికంగా ఉన్న నేతలంతా ఐక్యం చేసి ఉమ్మడి అభ్యర్థిగా గుజ్జ యుగంధర్ రావణ నిలబెట్టి మరోసారి టిఆర్ఎస్ గెలవడానికి అధిష్టానం పక్కాగా వ్యూహలు రచిస్తున్నట్టు తెలుస్తుంది…
దీనికి తోడు బి.ఆర్.ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఈసారికి పక్కకు పెట్టాలని యోచనలో ఉన్నట్టు తెలియడంతో వ్యతిరేకత ఉన్న మల్లయ్య యాదవ్ కు కాదని గుజ్జ యుగంధర్ రావ్ కి టికెట్ ఇవ్వాలని భావించినట్లు తెలుస్తుంది…
దీంతో త్వరలోనే నియోజకవర్గ పర్యటన చేయడానికి స్థానిక నేతల సహకారం తీసుకొని యుగంధర్ రావు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇప్పటికే తెలుస్తుంది…
మాజీ ఎమ్మెల్యే చందర్ రావు సూచనల మేరకే….
కోదాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వేనేపల్లి చందర్ రావు కు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు కోదాడ పట్టణంలో గట్టిపట్టుంది… దీనికి తోడు అనుభవం కలిగిన నేత చందర్రావు అండలేనిది కోదాడలో టిఆర్ఎస్ గెలవడం అసాధ్యం..
చందర్రావు తో పాటు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డికి తన రెడ్డి సామాజిక వర్గం తో పాటు ఇతర సామాజిక వర్గాల నాయకులలో మంచి పట్టుంది….
గతంలో ఎవరి దారి వాళ్ళు చూసుకున్న ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఐక్యతరాగం పాడుతుండడం విశేషం… వీరిద్దరికి తోడు మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణ, మోతే చిలుకూరు తో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై వ్యతిరేకంగా ఉన్న నేతలంతా వీరి వర్గంలోనే ఉండడం విశేషం…
సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని టిఆర్ఎస్ కోల్పోవద్దంటే వీరందరూ సూచనల మేరకు పని చేయాల్సి ఉంది… దీంతో టిఆర్ఎస్ అధిష్టానం పక్క పార్టీ వాళ్లకు గాళం వేసి తమ పార్టీలో తీసుకునే టైం లో ఉన్న పార్టీ నేతలే పార్టీని వేయడం వారికి ఇష్టం లేక సయోధ్యకు చూస్తుంది…
దీంట్లో భాగంగానే వీరందరికీ నచ్చిన నేతను సూచించాలని చెప్పడంతో అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే వేంపల్లి చందర్రావు యుగంధర్ రావును సూచించినట్లు విశ్వసనీయ సమాచారం…
బలమైన నాయకుడిగా ఉన్నచందర్రావు సూచన మేరకే యుగంధర్ రావు వైపు అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తుంది..
మరోపక్క కాంగ్రెస్ నుండి బలమైన అభ్యర్థి ఉండడంతో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఐక్యంగా తీసుకొని ముందుకు వెళ్లి ఆమోదయోగ్యంగా ఉన్న యుగంధర్ రావును బరిలో నిలిపితే గెలిచే అవకాశాలున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సైతం అధిష్టానానికి సూచించడంతో అభ్యర్థిత్వం ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం….
ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ను ఎమ్మెల్యే గా గెలిపించిన వారే అడ్డం తిరగడంతోనే….
ఎమ్మెల్యేగా మల్ల యాదవ్ గెలిచిన తర్వాత స్వయంగా అతనే నేతల్ని ఎంపిక చేసుకొని గ్రామ సర్పంచులు గా ఎంపీపీ జడ్పిటిసిలుగా దగ్గరుండి మరి కష్టపడి గెలిపించుకున్నాడు…
మున్సిపల్ చైర్మన్ తో సహా ఆయన స్వయంగా ఎంపిక చేసిన వారే…. ఈయన గెలిపించిన నేతలు ఈయనకు అడ్డం తిరుగుతుండడంతో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని ఆలోచన మొదలుపెట్టింది.