ల్యాండర్, రోవర్ ల జీవిత కాలం అంత తక్కువనా..?
భారతదేశం చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ భాగం పై విజయవంతంగా దించింది. అయితే చంద్రునిపై దిగిన ల్యాండర్ చంద్రుని భూ భాగంపై తిరుగుతూ అక్కడి విశేషాలను ఫోటోలను తీసి ఎప్పటికప్పుడు పంపిస్తుంది.
అయితే ఈ రోవర్, దానిలోని ల్యాండర్ లు ఎన్ని రోజులు అక్కడ పని చేయనున్నాయని ప్రతీ ఒక్క భారతీయుడ్ని వేధిస్తున్న ప్రశ్న.
రోవర్ కు సోలార్ ప్యానెల్ తో శక్తి సరఫరా అవుతుంది. ప్రస్తుతం అది బాగా పని చేస్తుంది. అయితే శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం రోవర్ జీవిత కాలం 14 రోజులని తెలుస్తోంది. ఎందుకంటే వీటి జీవిత కాలం 14 రోజులేనని ఇస్రో వెల్లడించింది.
మరి 14 రోజుల తర్వాత వీటి పరిస్థితి ఏమిటి అని సగటు భారతీయున్ని వేధిస్తున్న ప్రశ్న. విక్రమ్, ప్రజ్ణాన్ రోవర్ లు సౌరశక్తి ఆధారంగా పని చేస్తాయి.
చంద్రునిపై సూర్యరశ్మి 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చీకటి ఆవరిస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. మళ్లీ 14 రోజుల తర్వాతే సూర్యుడు ఉదయిస్తాడు.
ఈ అంశమే ల్యాండర్, రోవర్ ల జీవిత కాలం 14 రోజులు అని చెప్పడానికి కారణం అవుతున్నాయి. చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం.
చంద్రునిపై ఆగస్టు 23న సూర్యోదయం అయింది. ఆ సమయంలోనే చంద్రయాన్ ను సురక్షింతంగా ఇస్రో ను ల్యాండ్ చేసారు.
పగటి వాతావరణం సెప్టెంబర్ 5 నుండి 6వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత చంద్రునిపై ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. రాత్రి పూట కూడా భూమిపై వేడిగా ఉంటుంది. కాని చంద్రుడిపై అలా ఉండే అవకాశం లేదు.
పడిపోయిన ఉష్ణోగ్రతలతో రోవర్, ల్యాండర్ లు పని చేసే అవకాశం తక్కువని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. సూర్యోదయం తర్వాత పని చేస్తాయా లేదా అని చూడాల్సి ఉంటుందంటున్నారు.